May 12 2021 @ 07:39AM

కృతి శెట్టి స్టార్ డైరెక్టర్‌కు నో చెప్పిందా..?

కృతి శెట్టి స్టార్ డైరెక్టర్‌కు నో చెప్పిందా.. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో, ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరోయిన్ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. చేతిలో అరడజను సినిమాలున్నాయని సమాచారం. నానితో శ్యామ్ సింగ రాయ్, సుధీర్ బాబుతో ఒక సినిమా, రామ్ పోతినేనితో ఒక సినిమా అధికారకంగా ప్రకటించారు. మరో మూడు సినిమాలు కూడా సైన్ చేసిందని తెలుస్తోంది. ఇదే క్రమంలో తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు హీరోయిన్‌గా కృతి శెట్టిని సంప్రదించగా నో చెప్పిందట. తేజ సినిమాలలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటి దర్శకుడికి ఎందుకు నో చెప్పిందనే విషయం తెలియాల్సి ఉంది.