రైతులు ‘నా కోసం చనిపోయారా’ అని మోదీ అన్నారు: గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-01-03T17:11:32+05:30 IST

వును, కొంత కాలంగా ఈ దేశాన్ని పాలిస్తుంది మీరే అని మోదీకి సమాధానం చెప్పాను. ఏదైతేనేమి, కొంత సమయానికి మా యుద్ధం ముగిసింది. అయితే అమిత్ షాను కలవమని ఆయన నాకు చెప్పాను. ఆయన చెప్పినట్టే చేశాను..

రైతులు ‘నా కోసం చనిపోయారా’ అని మోదీ అన్నారు: గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: రైతు సమస్యలపై మాట్లాడానికి వెళ్లినప్పుడు ప్రధానమంత్రి మంత్రి నరేంద్రమోదీ చాలా అహంకారపూరితంగా మాట్లాడారని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రైతులు ఏమైనా నా కోసం చనిపోయారా?’ అని మోదీ అన్నారని ఆయన అన్నారు. కొద్ది సమయం మోదీతో తాను యుద్ధమే చేశానని సత్యపాల్ మాలిక్ చెప్పుకొచ్చారు. హర్యానాలోని దాద్రిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సత్యపాల్ మాలిక్ మాట్లాడుతూ ‘‘నేను ప్రధానమంత్రి మోదీని కలిసి రైతు సమస్యల గురించి మాట్లాడాను. అయితే మన రైతులు 500 మంది చనిపోయారని చెప్పినప్పుడు ‘వాళ్లేమైనా నాకోసం చనిపోయారా?’ అని ఆయన అడిగారు. చాలా అహంకారంగా మాట్లాడారు’’ అని మాలిక్ అన్నారు.


అనంతరం మోదీకి బదులిస్తూ ‘‘అవును, కొంత కాలంగా ఈ దేశాన్ని పాలిస్తుంది మీరే అని మోదీకి సమాధానం చెప్పాను. ఏదైతేనేమి, కొంత సమయానికి మా యుద్ధం ముగిసింది. అయితే అమిత్ షాను కలవమని ఆయన నాకు చెప్పాను. ఆయన చెప్పినట్టే చేశాను’’ అని సత్యపాల్ మాలిక్ అన్నారు. అయితే కుక్క చనిపోతే మోదీ నివాళులు అర్పిస్తారని ఎద్దేవా చేశారు. కొంత కాలంగా ముఖ్యంగా రైతు సమస్యలపై భారతీయ జనతా పార్టీ నాయకత్వంపై మాలిక్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జమ్మూ కశ్మీర్ నుంచి మేఘాలయకు గవర్నర్‌గా మార్చిన అనంతరం నుంచి మోదీ-షాలపై తరుచూ విమర్శలు చేస్తూ వస్తున్నారు.

Updated Date - 2022-01-03T17:11:32+05:30 IST