Advertisement

Naga Chaitanya divorce: వెంకటేష్ కౌంటర్లు ఎవరికి?

టాలీవుడ్‌ స్టార్‌ కపుల్ నాగచైతన్య, సమంత విడాకులు వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా వీరి విడాకుల విషయమై పుకార్లు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. వాటిని నిజం​ చేస్తూ తాము విడాకులు తీసుకోతున్నట్టు చై-సామ్‌ గత శనివారం వెల్లడించారు. తమ ప్రైవసీకి భంగం కలిగించ వద్దని విజ్ఞప్తి చేశారు. అయినా వారి విడాకుల గురించి అందరూ కామెంట్లు చేస్తూనే ఉన్నారు. ఈ జంట విడిపోవడానికి ఇదే కారణమంటూ కొందరు తమకు ఇష్టమొచ్చిచ్చినట్లుగా విశ్లేషణలు చేస్తున్నారు. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. 


విడాకుల స్పెషలిస్ట్‌గా పేరు పొందిన బాలీవుడ్ స్టార్ హీరో వల్లే నాగచైతన్య తన భార్యకు విడాకులు ఇచ్చేశాడనే అర్థం వచ్చే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలాగే ఓ వివాహం విఫలమైందంటే దానికి ఎప్పుడూ పురుషుడే కారణమని కూడా వ్యాఖ్యానించింది. బాలీవుడ్ హీరో సూచనలు, సలహాలు విని చైతన్య తన భార్యకు విడాకులు ఇచ్చేశాడని ఆమె ఆరోపించింది. ఆమెకు కౌంటర్ గానే టాలీవుడ్ ప్రముఖ హీరో, చైతన్య మామయ్య వెంకటేష్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారని కొందరు భావిస్తున్నారు. 


`మనం నోరు తెరిచే ముందు.. కాసింత మొదడును ఉపయోగిద్దాం`, `మైండ్ అంటే ఆలోచనలతో నిండిపోయిన ట్రాఫిక్ లాంటిది. మన దారిని జాగ్రత్తగా ఎంచుకోవాలి` అంటూ వెంకటేష్ పోస్టులు పెట్టారు. సమంత-చైతన్య విడాకుల గురించి అనవసరంగా స్పందిస్తున్న వారిని, చైతన్యను విమర్శించిన కంగనను ఉద్దేశించే వెంకీ ఈ కామెంట్లు చేశారని టాలీవుడ్ వర్గాల సమాచారం. 



Advertisement

Bollywoodమరిన్ని...