Jun 10 2021 @ 14:32PM

మహేష్‌కి ఆ డైరెక్టర్ చెప్పిన కథ నచ్చలేదా..?

సూపర్‌స్టార్ మహేష్ బాబుకి ఇటీవల 'కేజిఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక కథ చెప్పగా ఆయన దాన్ని రిజెక్ట్ చేసినట్టు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోందట. ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య ప్రశాంత్ నీల్‌తో సినిమా చేసేందుకు అడ్వాన్స్ ఇచ్చారట. మహేష్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో దానయ్య ఓ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేసుకున్నారని సమాచారం. దీనిలో భాగంగా మహేష్‌కి ప్రశాంత్ ఓ యాక్షన్ కథని నరేట్ చేశారట. ఆ కథ మహేష్‌ని ఆకట్టుకోకపోవడంతో సున్నితంగా తిరస్కరిస్తూ, మరో కథ ఏదైనా ఉంటే చెప్పమని కోరారట. ప్రస్తుతం ఈ విషయం ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక 'కేజిఎఫ్' చూసిన మహేష్..స్వయంగా ఫోన్ చేసి ప్రశాంత్ నీల్‌ని అభినందించాడు. కాగా మహేష్, ప్రశాంత్ నీల్ చెప్పిన కథను రిజెక్ట్ చేశాడనే విషయంలో అసలు నిజం ఏంటనేది తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌తో 'సలార్' తెరకెక్కిస్తున్నాడు. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్‌తో ఓ సినిమా చేయనున్నాడు.