Advertisement
Advertisement
Abn logo
Advertisement

డీజిల్‌, పెట్రోల్‌ ధరలు తగ్గించాలి

నారాయణపేట టౌన్‌, నవంబరు 30 : రాష్ట్ర ప్రభుత్వం డీజిల్‌, పెట్రోల్‌ ధరలు తగ్గించాలని బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపులో భాగంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు జిల్లా కేంద్రంలో కాడెద్దులతో ప్రదర్శన మం గళవారం నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. దీపావళి కానుకగా ప్రధాని మోదీ డీజిల్‌పై పది, పెట్రోల్‌పై రూ.5 తగ్గించి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ధరలు తగ్గించి ప్రజలపై ఆర్థిక భారం పడకుండా చూడాలని విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. దీంతో కొన్నీ రాష్ట్రాల్లో ధరలు తగ్గించగా తెలంగాణాలో మాత్రం ప్రభుత్వం వ్యాట్‌ తగ్గించకుండా మొండిగా వ్యవహరిస్తోంద న్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ తగ్గించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాగూరావు నామాజీ, సత్య యాదవ్‌, శ్రీనివాస్‌, ప్రభాకర్‌ వర్దన్‌, లక్ష్మీశ్యాం, రఘు రామయ్య, సాయిబన్న, కౌన్సిలర్లు అనూష, విశాలాక్షి, ప్రమీల, వెంకటయ్య, శ్రీనివాస్‌, రఘువీర్‌, భరత్‌, రాము, రఘు పాల్గొన్నారు.

కోస్గి : ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాలంటూ బీజేపీ నాయకులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. కోస్గి పట్టణంలో బీజేపీ నాయకులు బీడీల శ్రీకాంత్‌, గందె వెంకటయ్య, కిరణ్‌కుమార్‌, నాగులపల్లి వెంకట్రాములు, కన్నారావు, బెజ్జు జైపాల్‌, సంపల్లి శ్రీనివాస్‌, బీజేవైఎం నాయకులు శ్రీకాంత్‌గౌడ్‌, కాశీనాథ్‌ నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరగడంతో సామాన్య ప్రజలకు భారం కాకూడదని ప్రధాని నరేంద్ర మోదీ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించారని, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ను తగ్గించి సామాన్య ప్రజలపై భారం తగ్గించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకొని రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందించారు. 

ధన్వాడ : పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం ధన్వాడ తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరే కంగా నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్‌ బాల్‌చందర్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ విమల, మాజీ వైస్‌ ఎంపీపీ రాంచంద్రయ్య, మల్ల య్య, ఎంపీటీసీలు ఉమేష్‌కుమార్‌, మాధవి, లంకాల శ్రీనివాసులు గౌడ్‌, బీజేవైఎం మండలాధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి, ఎర్రప్ప, విజయ్‌, విష్ణు, బాల్‌రాజ్‌ పాల్గొన్నారు.

మరికల్‌ : పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని మంగళవారం బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. బీజేపీ మండలా ధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాలని ప్రభుత్వానికి వ్యకతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో తిరుపతిరెడ్డి, వేణు, అనిల్‌ కుమార్‌, వెంకటేష్‌, రమేష్‌ పాల్గొన్నారు.


కోస్గిలో తహసీల్దార్‌కు వినతి పత్రం ఇస్తున్న బీజేపీ నాయకులు


Advertisement
Advertisement