డీజిల్‌ ట్యాంకర్‌ దగ్ధం

ABN , First Publish Date - 2020-10-16T06:01:48+05:30 IST

కరీంనగర్‌ జిల్లా రూరల్‌ మండలం మొగ్ధుంపూర్‌ గ్రామ శివారులో రాజీవ్‌రహదారిపై గురువారం మధ్యాహ్నం

డీజిల్‌ ట్యాంకర్‌ దగ్ధం

ఇంధనం లేకపోవడంతో తప్పిన ప్రమాదం


కరీంనగర్‌ క్రైం, అక్టోబరు 15 : కరీంనగర్‌ జిల్లా రూరల్‌ మండలం మొగ్ధుంపూర్‌ గ్రామ శివారులో రాజీవ్‌రహదారిపై గురువారం మధ్యాహ్నం ఐఓసీఎల్‌కు చెందిన డీజిల్‌ ట్యాంకర్‌(టీఎస్‌ 02 యూబీ 5958) దగ్ధమైంది. చొప్పదండి పెట్రోల్‌ బంక్‌లో డీజిల్‌ ఖాళీ చేసి తిరిగి రామగుండం వెళుతున్న సమయంలో ట్యాంకర్‌ ఇంజన్‌లో ఒక్కసారిగా మంటలు అంటుకుని క్యాబిన్‌, టైర్లు, ఇంజన్‌ దగ్ధమైంది. క్యాబిన్‌లోకి పొగలు రావటాన్ని గమనించిన డ్రైవర్‌ పీ రాము, మరో సహా యకుడు వెంటనే ఇంజన్‌ ఆఫ్‌ చేసి కిందకు దూకి పరుగెత్తారు. స్థానికులు గమనించి కరీంనగర్‌ అగ్నిమాపకశాఖ అధికారులకు సమాచారం అందించగా వెంటనే ఫైరింజన్‌తో అక్కడికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే క్యాబిన్‌ టైర్లు, ఇంజన్‌ దగ్ధం కావటంతో సుమారు రూ. 8 లక్షల వరకు నష్టం వాటిల్లిందని కరీంనగర్‌ ఫైర్‌ ఆఫీసర్‌ పరమేశ్వర్‌ తెలిపారు. ట్యాంకర్‌లో డీజిల్‌ లేక పోవటంతో పెద్ద ప్రమాదం తప్పిందని అన్నారు.   

Updated Date - 2020-10-16T06:01:48+05:30 IST