Oct 19 2021 @ 15:13PM

Ante sundaranikee : సెట్లో దర్శకుడి పుట్టినరోజు వేడుకలు

నేచురల్ స్టార్ నానీ హీరోగా, ‘మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా’ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కామెడీ ఎంటర్ టైనర్ ‘అంటే సుందరానికీ’. ఈ సినిమాతో మలయాళ క్యూట్ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయికగా టాలీవుడ్ కు పరిచయమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైద్రాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. ఇందులో నానీ ‘గే’ పాత్రలో నటిస్తున్నట్టు ఈ మధ్య వార్తలొచ్చాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకుంటోన్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి.నేడు దర్శకుడు వివేక్ ఆత్రేయ పుట్టినరోజు సందర్బంగా చిత్ర యూనిట్ .. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో సెట్లో ఆయన బర్త్ డే వేడుకలు ఘనంగా జరిపారు. వివేక్ ఆత్రేయ కేట్ కట్ చేసి యూనిట్ సభ్యులకు తినిపించారు. ఈ విషయాన్ని తెలియచేస్తూ చిత్ర యూనిట్ ట్విట్టర్ లో బర్త్ డే ఫోటోస్ ను షేర్ చేశారు. అలాగే.. ఆయనపై తీసిన ఓ సరదా వీడియో క్లిప్ ను కూడా జతచేశారు. వచ్చే ఏడాది విడుదల కాబోతున్న ‘అంటే సుందరానికీ’ చిత్రం నాని కి ఏ రేంజ్ లో హిట్టిస్తుందో చూడాలి.