తేమలో తేడా

ABN , First Publish Date - 2021-12-04T04:01:26+05:30 IST

రైతులు ప్రైవేటు వ్యాపారుల చేతిలో మోసపోకుండా వరికి మద్దతు ధర రావడానికి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది.

తేమలో తేడా
మదనాపురం మార్కెట్‌యార్డులో ప్రభుత్వ, ప్రైవేటు మిషన్‌లో తేమ తేడా

- కొనుగోలు కేంద్రం మిషన్లలో మార్పులు 

- ప్రైవేటు మిలర్ల మిషన్‌ కంటే ఎక్కువ శాతం తేమ 

- ఎంత ఆరబెట్టినా రాని పొడి శాతం

- చేసేది లేక ప్రైవేటుకే అమ్ముకుంటున్న రైతులు


మదనాపురం, డిసెంబరు 3 : రైతులు ప్రైవేటు వ్యాపారుల చేతిలో మోసపోకుండా వరికి మద్దతు ధర రావడానికి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వనపర్తి జిల్లాలో సింగిల్‌ విండో, ఐకేపీ ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేశారు. ధాన్యంలో తేమ 17శాతం ఉంటే ప్రభు త్వం కొనుగోలు చేసి క్వింటాల్‌కు రూ.1960 ఇస్తుం ది. కానీ కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు ఇచ్చిన తేమ మిషన్లలో ఎన్ని రోజులు ధాన్యం ఆరబెట్టినా 17 శాతం రాకపోవడంతో రైతులు ప్రైవేటు వ్యాపా రులను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు వ్యాపారులు వారి వద్ద ఉండే మిషన్లలో తేమను చూస్తే ప్రభు త్వ మిషన్లలో కన్నా 8 పాయింట్ల వరకు తక్కువ చూపిస్తోంది. మిషన్లలో తేడా ఉందని అభ్యంత రాలు వ్యక్తం చేస్తే కార్యాలయాల వద్దకు వెళ్లి వేరే మిషన్లను తెచ్చారు. అయినా ప్రభుత్వ, ప్రైవేటు మిషన్లలో తేమ తేడా మాత్రం మారలేదు. దీంతో రైతులు ధాన్యాన్ని ఆరబెట్టలేక క్వింటాల్‌ రూ.1800 చొప్పున అమ్ముతున్నారు. ఈ విషయం జిల్లా అధి కారులకు తెలిపినా ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం వెనుక ఆంతర్యం అర్థం కాలేదు. ఇలా గైతే రైతుల వద్ద తక్కువ ధాన్యాన్ని సేకరించవచ్చ నే ఆలోచన ప్రభుత్వ అధికారుల మదిలో ఉందని రైతులు వాపోతున్నారు. ధాన్యాన్ని కొంటే కొనండి.. లేకపోతే లేదు, కానీ తప్పుడు మిషన్లు ఇవ్వడం ఏంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


ప్రైవేటు మిషన్‌లో తేమ తక్కువ

నేను ఆరు ఎకరాలలో వరి వేశా. ధాన్యాన్ని వారం రోజులు ఆరబెట్టిన. కొనుగోలు కేంద్రాల వద్ద మిషన్లు తేమ 20కి పైనే వచ్చింది. నాకు అనుమానం వచ్చి ప్రైవేటు వ్యా పారులను ఆశ్రయిస్తే వారి మిషన్‌లో 13శాతం రావడంతో వారికే ధాన్యాన్ని అమ్మిన.

- కోట్ల రాజు, నెల్విడి



Updated Date - 2021-12-04T04:01:26+05:30 IST