జొకో కంటే హలె‌ప్ కు తక్కువేల?

ABN , First Publish Date - 2020-09-23T09:16:22+05:30 IST

ఫ్రైజ్‌మనీలో వ్యత్యాసం చూపడం ద్వారా ఇటాలియన్‌ ఓపెన్‌ నిర్వాహకులు లింగ వివక్ష ప్రదర్శించారంటూ అభిమానులు నిప్పులు చెరిగారు. తాజాగా ముగిసిన ...

జొకో కంటే హలె‌ప్ కు తక్కువేల?

 ప్రైజ్‌మనీలో 10 యూరోల తేడా

 లింగ వివక్ష అంటూ ఫ్యాన్స్‌ ఫైర్‌

రోమ్‌: ఫ్రైజ్‌మనీలో వ్యత్యాసం చూపడం ద్వారా ఇటాలియన్‌ ఓపెన్‌ నిర్వాహకులు లింగ వివక్ష ప్రదర్శించారంటూ అభిమానులు నిప్పులు చెరిగారు. తాజాగా ముగిసిన ఈ టెన్నిస్‌ టోర్నీలో ప్రపంచ నంబర్‌ వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌, రొమేనియా స్టార్‌ సిమోనా హలెప్‌ పురుషుల, మహిళల విభాగాల్లో విజేతలుగా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా, జొకోకు రూ. 1,77,21,892 (2,05,200 యూరోలు) ప్రైజ్‌మనీ దక్కగా.. అతడి కంటే రూ. 863 (10 యూరోలు) తక్కువగా హలె్‌పకు నగదు బహుమతిని ప్రదానం చేశారు. అయితే, గ్రాండ్‌స్లామ్‌ల్లోనే సమానంగా ప్రైజ్‌మనీ ఉన్నప్పుడు.. ఈ టోర్నీలో వివక్ష ఏంటని ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా నిలదీశారు. కాగా, గతేడాది ఇదే టోర్నీలో పురుషుల విజేత రఫెల్‌ నడాల్‌కు మహిళల విజేత ప్లిస్కోవా కంటే రెట్టింపు ప్రైజ్‌మనీని ఇచ్చారు. కానీ, అప్పుడు ఎవరూ ప్రశ్నించకపోవడం కొసమెరుపు. 

Updated Date - 2020-09-23T09:16:22+05:30 IST