బయోడేటా, సీవీ, రెజ్యూమెలలో తేడాలు తెలుసా? ఇంటర్వ్యూలో అడిగితే ఏం చెబుతారు?.. నీళ్లు నమలకూడదనుకుంటే ఇది చదవండి!

ABN , First Publish Date - 2022-01-04T17:11:44+05:30 IST

బయోడేటా, రెజ్యూమె, సీవీ..

బయోడేటా, సీవీ, రెజ్యూమెలలో తేడాలు తెలుసా? ఇంటర్వ్యూలో అడిగితే ఏం చెబుతారు?.. నీళ్లు నమలకూడదనుకుంటే ఇది చదవండి!

బయోడేటా, రెజ్యూమె, సీవీ.. ఈ మూడింటినీ అభ్యర్థికి సంబంధించిన సమాచారం తెలియజేసేందుకు ఉపయోగిస్తారనే విషయం తెలిసిందే. ఈ మూడింటి మధ్య వ్యత్యాసం ఉందనే విషయం మీకు తెలుసా? ఇలాంటి ప్రశ్నను ఇంటర్వ్యూలో అడిగితే ఏం సమాధానం చెబుతారు? ఈ మూడింటికీ మధ్య ఉన్న తేడా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


రెజ్యూమె

ముందుగా రెజ్యూమె అంటే ఏమిటో తెలుసుకుందాం. రెజ్యూమెలో ప్రత్యేకంగా అభ్యర్థి విద్యార్హతలు, అనుభవం, కలిగివున్న నైపుణ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటుంది. దీనిలో ప్రొఫైల్ గురించిన అధిక సమాచారం ఉండదు. ఇది ఒకటి లేదా రెండు పేజీలు వరకూ మాత్రమే ఉంటుంది. ఇందులో లింగం, తండ్రి పేరు, జాతీయత, పుట్టిన తేదీ, అభిరుచుల గురించి సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉండదు.

సీవీ

ఇప్పుడు మనం సీవీ అంటే కరికులం విటే (CURRICULUM VITAE)గురించి తెలుసుకుందాం. ఇది లాటిన్  పదం. దీని అర్థం జీవిత గమనం. రెజ్యూమెలో ఉన్నదానికన్నా అధిక సమాచారం ఇందులో ఇస్తారు. రెజ్యూమెలో ఇచ్చిన సమాచారంతో పాటు అభ్యర్థికి గల ప్రత్యేక నైపుణ్యాలు, గత అనుభవం,  ప్రొఫైల్‌ వివరాలు దీనిలో ఉంటాయి. సాధారణంగా ఇది మూడు పేజీలలో ఉండాలి. లేదా అనుభవాన్ని అనుసరించి పేజీల సంఖ్యను కూడా పెంచవచ్చు.


బయోడేటా

బయోడేటా అంటే బయోగ్రాఫికల్ డేటా. ఇది 80 లేదా 90 పదాల మధ్యలో ఉంటుంది. సాధారణంగా అభ్యర్థికి సంబంధించిన ప్రాథమిక సమాచారం రెజ్యూమెలో ఉంటుంది. ఇందులో అభ్యర్థి పుట్టిన తేదీ, మతం, లింగం, చిరునామా, అభ్యర్థికి వివాహం అయ్యిందా? లేదా అనే సమాచారం ఉంటుంది. నిజానికి దీనిని ఉద్యోగాల ఇంటర్వ్యూలలో ఉపయోగించకూడదు. 

వీడియో రెజ్యూమె

ప్రస్తుతం వీడియో రెజ్యూమె ట్రెండ్‌లో ఉంది. చాలా కంపెనీలు వీడియో రెజ్యూమెని పంపమని అభ్యర్థిని అడుగుతున్నాయి. ఈ వీడియో రెజ్యూమెలో అభ్యర్థి ఒకటి నుంచి రెండు నిమిషాలలో.. తనకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలి. ఈ విధమైన వీడియో రూపొందించేటప్పుడు  మీరు ఏమి చెప్పాలనుకున్నారో ముందుగా నిర్ణయించుకుని, తడబాటు లేకుండా వివరంగా తెలియజేయండి. 



Updated Date - 2022-01-04T17:11:44+05:30 IST