XAEA-12 ఇది పేరండీ ‘బాబూ..’

ABN , First Publish Date - 2020-05-17T17:41:22+05:30 IST

చాలామంది హాలీవుడ్‌ స్టార్స్‌ తమ పిల్లలకి వింత పేర్లు పెట్టడం కొత్తేమీ కాదు. అయితే ఈ మధ్య ఇదొక ట్రెండ్‌గా మారింది. రియాలిటీ టీవీ స్టార్‌ కిమ్‌ కర్దాషియా తన కూతురికి ‘నార్త్‌’ అని పేరు పెట్టింది. కార్డిబి తన బిడ్డకు...

XAEA-12 ఇది పేరండీ ‘బాబూ..’

చాలామంది హాలీవుడ్‌ స్టార్స్‌ తమ పిల్లలకి వింత పేర్లు పెట్టడం కొత్తేమీ కాదు. అయితే ఈ మధ్య ఇదొక ట్రెండ్‌గా మారింది. రియాలిటీ టీవీ స్టార్‌ కిమ్‌ కర్దాషియా తన కూతురికి ‘నార్త్‌’ అని పేరు పెట్టింది. కార్డిబి తన బిడ్డకు ‘కల్చర్‌’ అని, గినెత్‌ పాలో్త్ర ‘ఆపిల్‌’, జేసన్‌ లీ ‘పైలట్‌ ఇన్స్‌పెక్టర్‌’ అని తమ పిల్లలకు విచిత్రమైన పేర్లు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీ ఖాన్‌, కరీనా కపూర్‌ తమ కొడుక్కి ‘తైమూర్‌’ అని నామకరణం చేయడంతో అప్పట్లో పెద్ద దుమారమే రేగింది.


ఎలెన్‌ మస్క్‌ ప్రేయసి గ్రిమ్స్‌ ఇటీవల ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ముద్దుల కొడుకు ముచ్చటైన ఫోటోను ట్వీట్‌ చేశాడతను.  ఆ బుడ్డోడి పేరేంటో తెలుసా? పలికే ముందు.. మీకు కోడింగు, డీకోడింగు తెలుసుంటే మంచిది. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్సీ అంత వేగంగా.. మీ మెదడు స్పందిస్తే ఇంకా మంచిది. ఇవన్నీ ఎందుకు.. అంతరిక్షంలో వ్యోమగామిలా తలకిందులుగా ఆలోచిస్తే ఇంకా ఇంకా మంచిది. ఆ పిలగాడి పేరు ‘ఎక్స్‌ ఎఇ ఎ- 12’. ‘ఎహె.. ఊరుకోండి. ఇది పేరేంటి? ఎలా పిలుస్తారు? బడిలో ఎలా రాస్తారు?’ అనే క్వశ్చన్లు వచ్చే ఉంటాయి. మీ బుర్రకు పదునుపెట్టడమే ఎలెన్‌ మస్క్‌ ఉద్దేశ్యం. ఆ నామధేయాన్ని డీకోడ్‌ చేసేందుకు ప్రపంచమంతా తలమునకలైంది. అందరూ అలసిపోయారు. అప్పుడు గ్రిమ్స్‌ తన కొడుకు పేరులోని మర్మాన్ని బయటపెట్టింది. ‘అవును ఇందులోని ప్రతి అక్షరానికీ, అంకెకూ ఒక ప్రత్యేకత ఉంది’ అంటూ పేరులోని అంతరార్థాన్ని విడదీసి చెప్పుకొచ్చింది.  


x - అస్థిరమైన పదం 

AE - లవ్‌ లేదా ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌

A-12 -ఫేవరెట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఎస్‌ఆర్‌ - 17కు పూర్వగామి. 


స్వతహాగా గాయని అయిన గ్రిమ్స్‌ ‘ఎ’ కు మరో రూపం తన కిష్టమైన ‘ఆర్చ్‌ఏంజెల్‌’ పాట అనీ పేర్కొంది.

గ్రిమ్స్‌ విశ్లేషణలో ‘ఎస్‌ఆర్‌ - 17’ ను మాత్రం ఎలెన్‌ మస్క్‌ వాస్తవం అన్నాడు కానీ మరే వివరణా ఇవ్వలేదు. 


ఇదంతా సరే.. 

కాలిఫోర్నియా చట్టం ప్రకారం పేర్లలో అంకెలూ, గుర్తులూ ఉండకూడదు. దీనికి ఎలెన్‌మస్క్‌ ఎలా స్పందిస్తాడు... కొడుకు పేరును మారుస్తాడా లేక ఆ కోడ్‌ను డీకోడ్‌ చేస్తాడా? వెయిట్‌ అండ్‌ సీ.

Updated Date - 2020-05-17T17:41:22+05:30 IST