వాట్సప్‌లో భిన్న వాల్‌ పేపర్స్‌!

ABN , First Publish Date - 2020-09-05T05:06:54+05:30 IST

వాల్‌పేపర్‌ ఫీచర్‌పై ప్రస్తుతం వాట్సప్‌ పనిచేస్తోంది. భిన్న ఛాట్స్‌ కోసం వేర్వేరు బ్యాక్‌గ్రౌండ్స్‌ను ఈ

వాట్సప్‌లో భిన్న వాల్‌ పేపర్స్‌!

వాల్‌పేపర్‌ ఫీచర్‌పై ప్రస్తుతం వాట్సప్‌ పనిచేస్తోంది. భిన్న ఛాట్స్‌ కోసం వేర్వేరు బ్యాక్‌గ్రౌండ్స్‌ను ఈ సరికొత్త ఫీచర్‌ అనుమతిస్తుంది. ఐఔస్‌ బేటా వెర్షన్‌లో ఇప్పటికే ఇది ఉంది. అయితే డెవల్‌పమెంట్‌ దశలో ఉన్నందున ప్రస్తుతం వినియోగదారులకు అందుబాటులో లేదు. 


త్వరలో దీన్ని అండ్రాయిడ్‌ వినియోగదారులకు కూడా అందుబాటులోకి తెచ్చే పనిలో వాట్సప్‌ ఉంది. పనిపూర్తయిన తరవాత ఒకేసారి బైటకు పంపాలని చూస్తోంది. వినియోగదారుడు ఒక వాల్‌పేపర్‌ను యాప్‌లో ఎంపిక చేసుకుంటే దాన్ని డౌన్‌లోడ్‌ చేయాలా, వద్దా అని వాట్సప్‌ అడుగుతుంది.

గూగుల్‌ ప్లే సదరు యాప్‌ను 2011 నుంచే ఉంచింది. సరికొత్త ఫీచర్‌ ఆరంభం కాగానే, వాట్సప్‌ మరిన్ని ఆప్షన్స్‌ను కలుగజేస్తుంది. అయితే ఈ వెసులుబాటు ఎప్పటికి అందుబాటులోకి త్వరలో వాట్సప్‌ వెల్లడించాల్సి ఉంది.


Updated Date - 2020-09-05T05:06:54+05:30 IST