వ్యవసాయ బిల్లుతో రైతులకు ఇబ్బందులు

ABN , First Publish Date - 2020-09-25T06:47:57+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లు చట్టం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటారని కాంగ్రెస్‌ కిసా న్‌ కేత్‌ రాష్ట్ర చైర్మన్‌ అన్వేష్‌రెడ్డి

వ్యవసాయ బిల్లుతో రైతులకు ఇబ్బందులు

పెర్కిట్‌, సెప్టెంబరు24: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లు చట్టం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటారని కాంగ్రెస్‌ కిసా న్‌ కేత్‌ రాష్ట్ర చైర్మన్‌ అన్వేష్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలోని స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో గురువారం నిర్వహిం చిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ చట్టం వల్ల రైతు పంటను దేశంలో ఎక్కడైనా విక్రయించుకునే అవ కాశం ఉందని చెబుతున్నా.. పరిశీలిస్తే కార్పొరేట్‌ కంపెనీలకు వ్యవసా యాన్ని దారాదత్తం చేసే కుట్ర ఉందని ఆరోపించారు. వ్యాపారస్థులకు లాభం తప్ప రైతులకు ఎలాంటి లాభం లేదన్నారు. మొక్కజొన్న కొను గోలు విషయంలో మంత్రి, ఎమ్మెల్యేలు మాట్లాడకపోవడం సరికాద న్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ ఎస్సీసెల్‌ చైర్మన్‌ పీసీ.భోజన్న, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు భగత్‌, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-25T06:47:57+05:30 IST