Abn logo
Sep 21 2021 @ 17:08PM

డీఐజీ వ్యాఖ్యలు అబద్దం: వర్ల రామయ్య

అమరావతి: చంద్రబాబు ఇంటిపై జోగి రమేష్ దాడిని పోలీస్‌శాఖ సమర్ధించడం సిగ్గుచేటని వర్ల రామయ్య మండిపడ్డారు. జోగి రమేష్ కాన్వాయ్‌ను చూస్తే మాట్లాడటానికి వచ్చినట్లుగా ఉందన్నారు. డీఐజీ త్రివిక్రమవర్మ వ్యాఖ్యలు అబద్దమని ఆయన కొట్టిపడేశాడు. జోగి రమేష్ దాడి గురించి పోలీసులకు ముందే తెలుసని చెప్పారు. డీఐజీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జోగి రమేష్‌ని హత్యాయత్నం కింద అరెస్ట్ చేయాలని,అలాగే రౌడీషీట్ తెరవాలన్నారు.  జోగి రమేష్‌ను వదిలి తమ నాయకులపై కేసులు పెడతారా? ఇదేమి న్యాయమని ఆయన అవేదన వ్యక్తం చేశారు. 


ఇవి కూడా చదవండిImage Caption