ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి : డీఐజీ

ABN , First Publish Date - 2020-04-05T10:55:33+05:30 IST

కరోనా నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహన్‌రావు సూచించారు.

ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి : డీఐజీ

జంగారెడ్డిగూడెం, ఏప్రిల్‌ 4: కరోనా నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహన్‌రావు సూచించారు. లాక్‌డౌన్‌కు సంబంధించి శనివారం ఆయన జంగారెడ్డిగూడెంలో ఆకస్మిక తనిఖీలు చేసి మాట్లాడుతూ  ఈ నెల 14వ తేదీ వరకు లాక్‌ డౌన్‌ ఉంటుందన్నారు. ప్రతి రోజు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంటాయన్నారు. మెడికల్‌ షాపులు మాత్రం 24 గంటలు అందు బాటులో ఉంటాయన్నారు. గూడ్స్‌, ఆక్వా కల్చర్‌, కోకోనట్‌, ఫార్మా, మెడికల్‌, ఆయిల్‌ పామ్‌, బ్యాంకు, పోస్టల్‌, కమ్యూనికేషన్‌ సరఫరా లకు అనుమతులున్నాయన్నారు. ఏలూరు రేంజ్‌ పరిధిలో 50 వేల మందిపైగా కేసులు నమోదు చేసి రూ.1.29 కోట్ల అపరాధ రుసుం  విధించామన్నారు. ఆయన వెంట జంగారెడ్డిగూడెం డీఎస్పీ స్నేహిత, సీఐ నాయక్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-04-05T10:55:33+05:30 IST