అట్రాసిటీ కేసుల దర్యాప్తు వేగవంతం చేయండి : డీఐజీ

ABN , First Publish Date - 2020-11-28T05:36:08+05:30 IST

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తు వేగవంతం చేసి నింది తులను త్వరితగతిన అరెస్టు చే యాలని ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు ఆదేశించారు.

అట్రాసిటీ కేసుల దర్యాప్తు వేగవంతం చేయండి : డీఐజీ

ఏలూరు క్రైం, నవంబరు 27: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తు వేగవంతం చేసి నింది తులను త్వరితగతిన అరెస్టు చే యాలని ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు ఆదేశించారు. రంపచోడవరం ఏఎస్పీ బిందు మాధవ్‌, కొవ్వూరు డీఎస్పీ బీ.శ్రీనాధ్‌లతో డీఐజీ శనివారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. వారి పరిధిలో నమో దైన ఎస్సీ, ఎస్టీ కేసుల వివరాలను తెలుసుకుని తగిన ఆదేశాలను జారీచేశారు. కేసు దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్లు కోర్టులో త్వరితగతిన దాఖలు చేయాలన్నారు. కోర్టు కేసుల్లో విచారణకు నిందితులు హాజరవుతున్నారో లేదో తెలుసుకోవాలన్నారు. కేసు దర్యాప్తులో అలసత్వం వహించవద్దని కాలపరిమితి లోపు కేసుల దర్యాప్తు పూర్తి చేయాలని డీఐజీ మోహనరావు ఆదేశించారు. 

Updated Date - 2020-11-28T05:36:08+05:30 IST