అల్లం నీళ్లతో జీర్ణం సులువు...

ABN , First Publish Date - 2020-12-09T19:15:02+05:30 IST

చలికాలంలో పలు రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కోసం అల్లంతో కషాయం, సూప్‌, టీ చేసుకొని తాగుతాం. అల్లం శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది కూడా. అల్లం నీళ్లు కూడా ఆరోగ్యానికి మంచే చేస్తాయి...

అల్లం నీళ్లతో జీర్ణం సులువు...

ఆంధ్రజ్యోతి(09-12-2020)

చలికాలంలో పలు రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కోసం అల్లంతో కషాయం, సూప్‌, టీ చేసుకొని తాగుతాం. అల్లం శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది కూడా. అల్లం నీళ్లు కూడా ఆరోగ్యానికి మంచే చేస్తాయి...

రోజూ గ్లాసు అల్లం నీళ్లు తాగితే చాలా రకాల అనారోగ్యాలు దరిచేరవు. అల్లంలోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 

చలికాలంలో జీర్ణ సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. అప్పుడు కొద్దిగా అల్లం నీళ్లు తాగితే ఉపశమనంగా ఉంటుంది. కడుపు ఉబ్బరం తగ్గిపోతుంది.

మధుమేహులు అల్లం నీళ్లు తాగితే చక్కెర నిల్వలు నియంత్రణలో ఉంటాయి. 

అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎముకల వాపును, ఆర్థరైటిస్‌ నొప్పిని తగ్గిస్తాయి. అంతేకాదు అల్లం నీళ్లు అలసిన కండరాలకు సాంత్వన ఇస్తాయి.. 

Updated Date - 2020-12-09T19:15:02+05:30 IST