త్వరలోనే అందుబాటులోకి ‘డిజిటల్ ఇంటెలిజెన్స్’... అవాంఛిత కాల్స్, ఆర్థిక మోసాలకు చెక్...

ABN , First Publish Date - 2021-03-04T01:00:33+05:30 IST

త్వరలోనే అందుబాటులోకి ‘డిజిటల్ ఇంటెలిజెన్స్’... అవాంఛిత కాల్స్, ఆర్థిక మోసాలకు చెక్...

త్వరలోనే అందుబాటులోకి ‘డిజిటల్ ఇంటెలిజెన్స్’... అవాంఛిత కాల్స్, ఆర్థిక మోసాలకు చెక్...

న్యూఢిల్లీ : అవాంఛిత ఫోన్ కాల్స్, సందేశాలతో పాటు టెలికం సోర్సెస్ ఆధారంగా జరిగే ఆర్థిక మోసాలను నియంత్రించే క్రమంలో... కేంద్ర ప్రభుత్వం త్వరలో ‘డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్‌’ను అందుబాటులోకి తీసుకురానుంది. వీటిని కట్టడి చేసే అంశంపై టెలికం శాఖ దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ ఇంటెలిజెన్స్ యూనిట్‌ను, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. కేంద్రం కొద్దరోజుల క్రితమే ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 

అవాంఛిత కాల్స్, అవాంఛిత సందేశాలతో టెల్కో యూజర్లను వేధిస్తూ, నిబంధనలను ఉల్లంఘించే టెలీ మార్కెటర్లు, ఇతర వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాని అధికారులను పప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. అవాంఛిత కాల్స్, ఆర్థిక మోసాల కట్టడి కోసం డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్‌ (డీఐయూ) ఏర్పాటు కానున్నట్లు కేంద్రం ఇప్పటికే వెల్లడించింది.

Updated Date - 2021-03-04T01:00:33+05:30 IST