రూ.2.5 కోట్లతో డిజిటల్‌ లైబ్రరీలు : పద్మశ్రీ

ABN , First Publish Date - 2022-01-23T06:33:24+05:30 IST

త్వరలో అన్ని గ్రంథాలయాలను డిజిటల్‌ లైబ్రరీలుగా తీర్చిదిద్దుతామని జిల్లా గ్రం థాలయాల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ చీర్ల పద్మశ్రీ అన్నారు.

రూ.2.5 కోట్లతో డిజిటల్‌ లైబ్రరీలు : పద్మశ్రీ
మాట్లాడుతున్న పద్మశ్రీ

ఏలూరు టూ టౌన్‌, జనవరి 22 :  త్వరలో అన్ని గ్రంథాలయాలను డిజిటల్‌ లైబ్రరీలుగా తీర్చిదిద్దుతామని జిల్లా గ్రం థాలయాల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ చీర్ల పద్మశ్రీ అన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాల యంలో శనివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడుతూ కంప్యూ టర్ల కొనుగోలుకు రూ.2.5 కోట్లు మంజూర య్యాయన్నారు. వీటితో జిల్లాలోని 33 శాఖా గ్రంథాలయాల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కోసం రూ.8 లక్షలు, జనరేటర్ల నిర్వహణకు రూ.50 వేలు ఖర్చు చేస్తున్నామన్నారు. పుస్తకాల బైండింగ్‌కు రెండు లక్షలు కేటాయించామన్నారు. డీఈవో సీవీ రేణుక, గ్రంథాలయాల అభివృద్ధి సంస్థ జిల్లా కార్యదర్శి వి.రవికుమార్‌, డిప్యూటీ లైబ్రేరియన్‌ వి.శ్రీనివాస్‌, వయోజన విద్య ఏపీవో ఆర్‌.వి జయకుమార్‌,  డీఎల్‌పీవో బి.బాలు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-23T06:33:24+05:30 IST