డిజిటల్‌ మహానాడు

ABN , First Publish Date - 2020-05-28T10:21:45+05:30 IST

కరోనా వైరస్‌ నేపథ్యంలో జూమ్‌ వెబినార్‌ నిర్వహించిన టీడీపీ మహానాడును జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో

డిజిటల్‌ మహానాడు

జూమ్‌ వెబినార్‌ ద్వారా వీక్షించిన టీడీపీ జిల్లా నేతలు


డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), మే 27: కరోనా వైరస్‌ నేపథ్యంలో జూమ్‌ వెబినార్‌ నిర్వహించిన టీడీపీ      మహానాడును జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆ పార్టీ శ్రేణులు వీక్షించారు. అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అధ్యక్షతన బుధవారం ప్రారంభమైన మహానాడులో పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప పాల్గొన్నారు. ఎల్జీ పాలిమర్స్‌ దుర్ఘటన, విద్యుత్‌ చార్జీల పెంపు, కరోనా వైరస్‌ విజృంభణ, వలస కార్మికుల కష్టాలు, టీటీడీ ఆస్తుల అమ్మకం, ఏడాది ఆరాచక పాలన, ప్రమాదంలో ప్రజాస్వామ్యం, అన్నదాత వెన్ను విరిచిన జగన్‌ సర్కార్‌, ధరలు, పన్నుల పెంపుదల, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విచ్ఛిన్నం, మూడు రాజధానులతో రాష్ట్ర అభివృద్ధి అథోగతి వంటి అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబు తన నివాసం నుంచి జూమ్‌ యాప్‌లో మహానాడు కార్యక్రమాలను తిలకించారు. కాకినాడలోని జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పిల్లి అనంతలక్ష్మ్డి-సత్తిబాబు దంపతులు, తుని నియోజకవర్గ ఇన్‌చార్జి యనమల కృష్ణుడు వీక్షించారు. తొలుత ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి టీడీపీ పతాకాన్ని ఆవిష్కరించారు. నాయకులు మందాల గంగ సూర్యనారాయణ, సుంకర విద్యాసాగర్‌, బోళ్ల కృష్ణమోహన్‌, తుమ్మల రమేష్‌, వొమ్మి బాలాజీ, గుత్తుల రమణ, ఎంఏ తాజుద్దీన్‌, గదుల సాయిబాబా, చింతలపూడి రవి, గుజ్జు బాబు, ఉమ్మిడిశెట్టి వెంకటరమణ, జోగా రాజు, పసుపులేటి వెంకటేశ్వరరావు, గుమ్మడి చిన్న, చోడిపల్లి సతీష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-28T10:21:45+05:30 IST