డిజిటల్ టోకెన్స్ పతనం... కిందటి సంవత్సరం ఫ్రాడ్ పెరిగింది...

ABN , First Publish Date - 2022-01-12T23:41:16+05:30 IST

యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు సంకేతాల నేపధ్యంలో క్రిప్టో కరెన్సీ పతనం కనిపిస్తోంది.

డిజిటల్ టోకెన్స్ పతనం... కిందటి సంవత్సరం ఫ్రాడ్ పెరిగింది...

ముంబై : యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు సంకేతాల నేపధ్యంలో క్రిప్టో కరెన్సీ పతనం కనిపిస్తోంది. క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ ఇటీవల ఓ సమయంలో 40 వేల డాలర్ల దిగువకు కూడా పడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కాస్త కోలుకున్నప్పటికీ... ఇప్పటికీ 40 వేల డాలర్ల స్థాయిలోనే ఉంది. ఆల్‌టైమ్ గరిష్టం 69 వేలతో దాదాపు 27 వేల డాలర్లు తక్కువగా ఉంది. బిట్‌కాయిన్ ఈ రోజు(బుధవారం) సాయంత్రం సెషన్‌లో 41,813 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ క్రితం సెషన్లో 1.96 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది. క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ 102.90 బిలియన్ డాలర్లుగా ఉంది.


భారత కరెన్సీ ప్రకారం బిట్ కాయిన్ నేటి ఉదయం సెషన్లో 33.83 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రిప్టో మార్కెట్‌లో ఈ కరెన్సీ వాటా 41 శాతం వరకు ఉంది. ఇదిలా ఉంటే... క్రిప్టో ఆధారిత క్రైమ్ కిందటి సంవత్సరం పెరిగింది. బ్లాక్ చైన్ డేటా కంపెనీ చైనాలసిస్ ప్రకారం అక్రమ చిరునామాలతో కూడిన లావాదేవీలు 2020 లో 7.8 బిలియన్ డాలర్ల విలువ  నమోదు కాగా, 2021 లో 14 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అయితే ఫ్రాడ్‌స్టర్స్ క్రిప్టోలావాదేవీల మొత్తం మాత్రం 2021 లో 0.15 శాతం తగ్గింది. చైనాలసిస్ ప్రకారం 2021 లో మొత్తం క్రిప్టో లావాదేవీల మొత్తం 15.8 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ఇక... 2020 తో పోలిస్తే ఇది ఆరు రెట్లు అధికం. 


కాగా... ఈ రోజు ఉదయం వివిధ క్రిప్టో కరెన్సీల విలువలిలా ఉన్నాయి. 

బిట్‌కాయిన్                :  రూ. 33,83,194, 

ఎథేరియం                :     రూ. 2,49,724, 

టెథేర్                     :     రూ. 80.39, 

కార్డానో             రూ. 92.3000, 

బియాన్స్ కాయిన్     :             రూ. 34,497.70,

ఎక్స్‌పీఆర్             :             రూ. 59.781,

పోల్కాడాట్             : రూ. 1,931.66,

డోజీకాయిన్                 : రూ. 11.6698. 

Updated Date - 2022-01-12T23:41:16+05:30 IST