అందుకే సినిమాటోగ్రఫీ మంత్రితో సమావేశమయ్యాం: దిల్ రాజు

తెలుగు చలనచిత్ర పరిశ్రమను కోలుకోలేని విధంగా ఏపీ ప్రభుత్వం ఇటీవల ఓ జీవోని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ జీవో విషయంలో సినీ పెద్దలు కొందరు మళ్లీ ఆలోచించాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. తాజాగా నిర్మాత దిల్ రాజు సహా కొందరు సినీ పెద్దలు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ని కలిసి.. సినిమా ఇండస్ట్రీ సమస్యలను తెలియజేశారు. 


తలసానిని కలిసిన అనంతరం నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘తెలుగు సినిమా ఇండస్ట్రీ సమస్యలపై మంత్రి తలసానిగారితో చర్చించాం. అనేక అంశాలు పరిష్కారం కావల్సి ఉంది. పెద్ద సినిమాలు అన్ని పూర్తి చేసుకుని విడుదల కోసం వేచి ఉన్నాయి. కోవిడ్ కారణంగా సినిమా ఇండస్ట్రీ చాలా ఇబ్బందులు పడింది. మళ్లీ ఇప్పుడు ఇంకో వేవ్ వస్తుందనే ప్రచారం జరుగుతోంది. సినిమా ఇండస్ట్రీ వాళ్లకు ఉన్న అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి మంత్రిగారితో సమావేశం అయ్యాము. మేము విన్నవించిన సమస్యలపై మంత్రి తలసాని స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌గారితో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు..’’ అని తెలిపారు.

Advertisement