Abn logo
May 10 2020 @ 14:50PM

స్టార్ హీరోతో దిల్‌రాజు మూవీ ప్లాన్‌?

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌తో మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ సినిమాను ద‌శ‌ర‌థ్ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించాడు దిల్‌రాజు. త‌ర్వాత ప్ర‌భాస్‌, దిల్‌రాజు కాంబినేష‌న్‌లో సినిమా రాలేదు. ఇప్పుడు ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇప్పుడు ప్ర‌భాస్‌తో సినిమా చేయాల‌ని చాలా మంది నిర్మాత‌లు ఎదురుచూస్తున్నారు. ఈ త‌రుణంలో దిల్‌రాజు కూడా ప్ర‌భాస్‌తో ఓ సినిమా చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. ఈ సినిమాను ఎవ‌రు డైరెక్ట్ చేయనున్నారో తెలుసా?  డైరెక్ట‌ర్ శ్రీరామ్ వేణు. ప్ర‌స్తుతం ప‌వ‌న్‌తో వ‌కీల్‌సాబ్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు శ్రీరామ్ వేణు. రీసెంట్‌గా ఈ డైరెక్ట‌ర్ దిల్‌రాజుకి ఓ లైన్ చెప్పాడ‌ట‌. ఆ లైన్ న‌చ్చ‌డంతో స్టోరీ డెవ‌ల‌ప్ చేయ‌మ‌ని దిల్‌రాజు అన్నాడ‌ట‌. అంతా ఓకే అయితే మ‌రోసారి ప్ర‌భాస్‌, దిల్‌రాజు కాంబినేష‌న్‌లో సినిమా తెరకెక్కే అవ‌కాశం ఉంది. 

Advertisement
Advertisement
Advertisement