Feb 2 2020 @ 16:32PM

అలా చేయాలంటే భ‌యం: దిల్‌రాజు

శ‌ర్వానంద్, స‌మంత హీరోహీరోయిన్లుగా ప్రేమ్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘జాను’. దిల్‌రాజు, శిరీష్ నిర్మాత‌లు. ఫిబ్ర‌వ‌రి 7న సినిమా విడుద‌ల‌వుతుంది. త‌మిళ చిత్రం ‘96’కు ఇది రీమేక్‌. ఇప్ప‌టి వ‌ర‌కు రీమేక్ సినిమాలు చేయ‌ని దిల్‌రాజు నిర్మించిన తొలి రీమేక్ ఇది. దీని గురించి దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘మా బ్యాన‌ర్ స్టార్ట్ అయ్యి 17 ఏళ్లు అవుతుంది. ఇన్నేళ్ల‌లో మేం రీమేక్ చేయ‌నేలేదు. తొలి రీమేక్ ఇది. రీమేక్ చేయాలంటే నాకు భ‌యం. ఎందుకంటే ఒరిజిల్ ఫీల్‌ను మిస్ కాకుండా తెర‌పైకి తీసుకురావ‌డం చాలా క‌ష్టం. త‌మిళంలో 96 సినిమాను రిలీజ్ కంటే ఒక నెల ముందు చూశాను. చూసిన త‌ర్వాత ప్రివ్యూ థియేట‌ర్ నుండి బ‌య‌ట‌కు రాగానే ప్రొడ్యూస‌ర్‌కి ఈ సినిమాను నేను తెలుగులో రీమేక్ చేస్తానంటూ ప్రొడ్యూస‌ర్‌కి చెక్ ఇచ్చేశాను. అందుకు కార‌ణం సినిమా చూసే స‌మ‌యంలో ఎమోష‌న్స్‌తో గుండె బ‌రువెక్కింది. అలాగే త‌మిళంలో సినిమా రిలీజ్ అయిన త‌ర్వాత ఆడియెన్స్‌తో క‌లిసి సినిమా చూశాను. ప్రేక్ష‌కుల నుండి వ‌చ్చిన రెస్పాన్స్ చూసి ఎవ‌రు ఏమ‌నుకున్నా? ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాల‌ని డిసైడ్ అయ్యాను.

 

స‌మంత‌ను ఈ సినిమా యాక్ట్ చేయించాల‌ని అనుకున్నాను. త‌ను త‌ప్ప‌.. ఆ పాత్ర‌లో మరొక‌రిని ఆ పాత్ర‌లో ఊహించుకోలేక‌పోయాను. ఇక నా బ్ర‌ద‌ర్ శ‌ర్వాకి ఫోన్ చేసి సినిమా చూడ‌మంటే సినిమా చూసి సూప‌ర్బ్‌గా ఉంద‌ని ఫోన్ చేశాడు. అలా శ‌ర్వా, స‌మంత ఈ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు.త‌మిళంలో సినిమా చేసిన ప్రేమ్‌కుమార్‌తో మాట్లాడి తెలుగులోనూ డైరెక్ట్ చేయ‌మ‌ని చెప్పాను. త‌మిళంలో చేసిన టెక్నీషియ‌న్సే ఈ సినిమాకు ప‌నిచేశారు. ఈ సినిమాను చేస్తున్న‌ప్పుడు దిల్‌రాజుకేమైనా మెంటలా? డ‌బ్బింగ్ చేయొచ్చు క‌దా? అని చాలా కామెంట్స్ విన్నాను. ఆ ఫీల్‌ను తెలుగులో అలాగే క్యారీ చేశాం. అదే ఫ్లేవ‌ర్‌ను డైరెక్ట‌ర్ ప్రేమ్ తెలుగులోకి తీసుకొచ్చారు. ఈ ఫిబ్ర‌వ‌రి 7న మా జాను సినిమాను చూసిన తెలుగు ప్రేక్ష‌కులు వావ్ అంటారు. చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాను. ఈ సినిమా హ్యంగోవ‌ర్‌లో ఉండిపోతాం. జాను సినిమా చూసిన త‌ర్వాత మ‌న లైఫ్‌లోని మెమొరీస్‌ను ఇంటికి తీసుకెళ్తాం. ఫిబ్ర‌వ‌రి 7న నేను చెప్పిన‌వ‌న్నీ నిజాలు అవుతాయి’’ అన్నారు.