Jun 11 2021 @ 23:18PM

దిలీప్‌కుమార్‌ ఇంటికి తిరిగొచ్చారు

బాలీవుడ్‌ దిగ్గజం దిలీప్‌కుమార్‌ శుక్రవారం  క్షేమంగా ఇంటికి తిరిగొచ్చారు. శ్వాస సంబంధమైన సమస్యలతో  గత ఆదివారం ఆయన ముంబైలోని హిందూజా ఆస్పత్రిలో చేరిన సంగతి విదితమే. ఆయన అనారోగ్యంపై చిత్ర ప్రముఖులే కాదు అభిమానులు కూడా ఆందోళన చెందారు. 


‘మీ అందరి ప్రేమాభిమానాలు, ప్రార్థన వల్ల దిలీప్‌ సాబ్‌ కోలుకుని ఇంటికి వచ్చేశారు. భగవంతుడి ఆశీస్సులతో పాటు డాక్టర్‌ గోఖలే, డాక్టర్‌  పార్కర్‌, డాక్టర్‌ అరుణ్‌ షా కృషితో ఆయన ఇంటికి వచ్చారు’ అని సోషల్‌ మీడియా ద్వారా ఆయన టీమ్‌ వెల్లడించింది. దిలీప్‌ సతీమణి సైరాబాను ‘దిలీప్‌ సాబ్‌ ఆరోగ్యం మెరుగుపడింది. శ్వాస పీల్చుకోవడంలో వచ్చిన సమస్యలు తగ్గాయి. అందరికీ ధన్యవాదాలు’ అని తెలిపారు.