నిరుద్యోగులను నట్టేట ముంచిన సీఎం

ABN , First Publish Date - 2022-01-25T05:57:37+05:30 IST

సీఎం జగన.. ప్రభుత్వోద్యోగుల రిటైర్మెంట్‌ వయసు పెంచడం ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగులను నట్టేట ముంచారని విద్యార్థి నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

నిరుద్యోగులను నట్టేట ముంచిన సీఎం
సమావేశంలో మాట్లాడుతున్న విద్యార్థి సంఘాల నాయకులు

విద్యార్థి సంఘాల నేతల మండిపాటు

అనంతపురం రైల్వే, జనవరి24: సీఎం జగన.. ప్రభుత్వోద్యోగుల రిటైర్మెంట్‌ వయసు పెంచడం ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగులను నట్టేట ముంచారని విద్యార్థి నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘జగనరెడ్డి మా ఉద్యోగాలెక్కడ? ఉద్యోగ విరమణ వయసు పెంచమని ఎవరడిగారు?’ అంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనపై ఎనఎ్‌సయూఐ ఆధ్వర్యంలో కాం గ్రెస్‌ పార్టీ స్థానిక జిల్లా కార్యాలయంలో సోమవారం రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఎనఎ్‌సయూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేష్‌, బీసీఆర్‌సీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్‌, టీఎనఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర అధికార ప్రతినిధి రఫీ, ఏపీఎ్‌సఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర, ఏఐఎ్‌సబీ నాయకుడు పృధ్వీ, యూఎనఐవీ రాష్ట్ర అధ్యక్షుడు రామన్న, టీఎ్‌సఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రవీంద్ర, ఎస్‌జేఎ్‌సఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు వసంతకుమార్‌, ఆర్‌వీఎస్‌ భూషణ్‌, బీఎ్‌సఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మూర్తి పాల్గొని, మాట్లాడారు. సీఎం జగన ఒక్క ఉద్యోగ ప్రకటన కూడ ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.5 లక్షల పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. సచివాలయ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా అందరినీ కలుపుకుని, పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. రౌంటేబుల్‌ సమావేశంలో భవిష్యత కార్యాచరణను రూపొందించారు. ఈనెల 27న వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టేలా నిర్ణయించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే దశలవారీగా పోరాటాలకు చేపడతామని స్పష్టం చేశారు.


Updated Date - 2022-01-25T05:57:37+05:30 IST