ప్రత్యక్ష పన్ను వసూళ్లు... రూ.v9.45 లక్షల కోట్లు...

ABN , First Publish Date - 2021-04-10T00:44:03+05:30 IST

2020-21 ఆర్థిక సంవత్సరంలో నెట్ డైరెక్ట్ ట్యాక్స్ వసైళ్ళు అంచనాలకు మించి రూ. 9.45 కోట్లు వసూలయ్యాయి.

ప్రత్యక్ష పన్ను వసూళ్లు... రూ.v9.45 లక్షల కోట్లు...

న్యూఢిల్లీ : 2020-21 ఆర్థిక సంవత్సరంలో నెట్ డైరెక్ట్ ట్యాక్స్ వసైళ్ళు అంచనాలకు మించి రూ. 9.45 కోట్లు వసూలయ్యాయి. కేంద్ర బడ్జెట్ అంచనాల కంటే 5 శాతం మేర ఎక్కువగా పెరిగాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్ పీసీ మోడీ శుక్రవారం  మాట్లాడుతూ... పన్ను వసూళ్లు అంచనాలకు మించి పెరిగినట్లు తెలిపారు. ఈ కాలంలో నెట్ కార్పోరేట్ ట్యాక్స్ వసూళ్ళు రూ. 4.57 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. నెట్ పర్సనల్ ఇన్‌కం ట్యాక్స్ రూ.4. 71 లక్షల కోట్లుగా నమోదైంది. మరో రూ. 16,927 కోట్లు సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ నుండి వచ్చాయి.


గత ఆర్థిక సంవత్సరంలో గ్రాస్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ రూ. 2.06 లక్షల కోట్లు. ఇందులో రీఫండ్ కింద రూ. 2.61 లక్షలకోట్లు వెళ్లింది. దీంతో నికర డైరెక్ట్ ట్యాక్స్ వసూళ్ళు రూ. 9.45 లక్షల కోట్లుగా నిలిచాయి. ఇక... 2020-21 ఆర్థిక సంవత్సరంలో సవరించిన పన్ను వసూళ్ళ అంచనా రూ. 9.05 లక్షల కోట్లు. అయితే అంచనాల కంటే 5 శాతం పెరగడం విశూషం. అదే సమయంలో 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 10 శాతం తక్కువ. ఇక ఈ ఆర్థిక సంవత్సరం కూడా పన్ను వసూళ్ళు పెరుగుతాయని భావిస్తున్నారు. కరోనా సమయంలో తగ్గుతాయని భావించిన వసూళ్ళు ఇప్పుడు పెరిగడం విశేషం. ఈ క్రమంలో... 2021-22లోనూ అదే ఒరవడి ఉంటుందని భావిస్తున్నారు.

Updated Date - 2021-04-10T00:44:03+05:30 IST