Oct 25 2021 @ 08:56AM

బన్నీ సినిమాకి స్ర్కిప్ట్ రెడీ చేసిన బోయపాటి

టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. ప్రస్తుతం ఓ సీనియర్ స్టార్ హీరోతో మాస్ యాక్షన్ మూవీ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. ఇంతలో బోయపాటి తన తదుపరి చిత్రానికి కూడా అప్పుడే స్ర్కిప్ట్ రెడీ చేయడం విశేషం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయపాటి మరో హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ తెరకెక్కించబోతున్నారు. ఇటీవల ఒక వేదికపై బోయపాటి నెక్స్ట్ మూవీని తమ బ్యానర్ లోనే చేయబోతున్నారని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. 



ఇంతకు ముందు బన్నీతో బోయపాటి తెరకెక్కించిన ‘సరైనోడు’ మూవీ ఏ రేంజ్ లో హిట్టైందో తెలిసిందే. ఈసారి అదిరిపోయే యాక్షన్ తో పాటు కామెడీని కూడా యాడ్ చేయబోతున్నారట బోయపాటి. మాస్ కథలతో హైఓల్టేజ్ యాక్షన్ మూవీస్ తీయడంలో చెయితిరిగిన బోయపాటి.. ఈ సారి ‘సరైనోడు’ చిత్రాన్ని మించిన కథతో రాబోతున్నారని తెలుస్తోంది. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన స్ర్కిప్ట్ ను బోయపాటి లాక్ చేశారట. బోయపాటి చెప్పిన స్టోరీ లైన్ బన్నీని బాగా ఇంప్రెస్ చేసిందట. ‘పుష్ప’  సిరీస్ తర్వాత బన్నీ చేయబోయే సినిమా ఇదే కాబోతోంది. మరి బన్నీ , బోయపాటి రెండో సినిమా ఏ పాయింట్ తో రానున్నదో చూడాలి.