Feb 2 2020 @ 16:42PM

యాంకర్‌ ప్రదీప్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన ద‌ర్శ‌కుడు

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ నిబంధనలకు విరుద్ధంగా రెండు రోజుల జైలు శిక్ష అనుభవించిన ప్రదీప్‌ ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నారని ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధమని ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో మేడ్చల్‌ జిల్లా కీసర సమీపంలోని రాంపల్లికి చెందిన శ్రీరామోజు సునిశిత్ అనే ద‌ర్శ‌కుడు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 

‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాలో ప్రదీప్‌ మాచిరాజు ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లుగా తెలిసిందే. ప్రదీప్‌ గతంలో ఒక అమ్మాయిని వేధించిన ఘటనలో రెండు రోజులు జైలుకు వెళ్లివచ్చారని, సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ రూల్స్‌కు వ్యతిరేకంగా ప్రదీప్‌ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారని స‌ద‌రు ద‌ర్శ‌కుడు ఆరోపించారు. అలాగే ప్రదీప్‌తో పాటు సినీ దర్శకుడు కూడా నిబంధనలను అతిక్రమించారన్నారు. ప్ర‌స్తుతం జ‌రుగుఈ షూటింగ్‌ ఆపాలని ఆదేశాలు జారీ చేయాల్సిందిగా ఫిర్యాదు చేసిన‌ట్లు తెలుస్తోంది.