Abn logo
Aug 11 2020 @ 07:52AM

సూర్యకు డైరెక్టర్ షాక్!!

హీరో సూర్యకు ఓ డైరెక్టర్ షాక్ ఇచ్చారని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇంతకూ ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా?.. హరి. అసలేం జరిగిందనే వివరాల్లోకెళ్తే.. హీరో సూర్య‌, డైరెక్ట‌ర్ హ‌రి కాంబినేష‌న్ అంటే మ‌న‌కు ‘సింగం’ సిరీస్ గుర్తుకు వ‌స్తుంది. ‘సింగం’ సిరీస్‌తో పాటు వీరి కాంబోలో ‘ఆరు, దేవా’ సినిమాలు రూపొందాయి. సూర్య ‘ఆకాశం నీ హ‌ద్దురా’ సినిమా త‌ర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ‘అరువా’ అనే సినిమా రూపొందుతుంద‌ని ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. అయితే ఏమైందో ఏమో కానీ.. వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ‘వాడివాస‌ల్’ సినిమాను చేస్తున్న‌ట్లు సూర్య ప్ర‌క‌టించారు. హ‌రిని వెయిటింగ్‌లో పెట్టారు. అయితే వెయిట్ చేయ‌డం డైరెక్ట‌ర్ హ‌రికి న‌చ్చ‌లేదో ఏమో.. సూర్య‌తో చేయాల్సిన సినిమాను అరుణ్ విజ‌య్‌(‘బ్రూస్ లీ, సాహో’ చిత్రాల్లో న‌టించిన న‌టుడు, న‌టుడు విజ‌య్ కుమార్ కుమారుడు)తో చేయడానికి రెడీ అయిపోయారని కోలీవుడ్ వర్గాల సమాచారం. త్వరలోనే ఈ విషయమై ప్రకటన వెలువడుతుందని సమాచారం. 

Advertisement
Advertisement
Advertisement