May 14 2021 @ 09:30AM

చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్ దర్శకుడు మారలేదు

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం త‌న 152వ చిత్రం ‘ఆచార్య‌’ను పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ లేకుండా ఉంటే, ఇప్ప‌టికే ఆచార్య షూటింగ్ పూర్త‌య్యేది. ఇది పూర్తి కాగానే మ‌ల‌యాళ చిత్రం ‘లూసిఫ‌ర్‌’ రీమేక్ చిత్రీక‌ర‌ణ‌ను స్టార్ట్ చేయాల‌నుకుంటున్నారు. ఈ రీమేక్‌ను తమిళ ద‌ర్శ‌కుడు మోహ‌న్‌రాజా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. కాగా.. రీసెంట్‌గా ఈ ప్రాజెక్ట్ నుంచి మోహ‌న్‌రాజా బ‌య‌ట‌కు వెళ్లిపోయార‌ని, చిరంజీవి అండ్ టీమ్ మ‌రో ద‌ర్శ‌కుడిని వెతికే ప‌నిలో ఉన్నార‌న్న‌ట్లు నెట్టింట వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి. కానీ ఈ వార్త‌ల్లో నిజం లేద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. మోహ‌న్‌రాజానే ఈ సినిమాను తెర‌కెక్కిస్తార‌ని స‌ద‌రు వ‌ర్గాలు క‌న్‌ఫ‌ర్మ్ చేశాయి. డైలాగ్ వెర్ష‌న్ కూడా పూర్త‌య్యింద‌ట‌. ఆచార్య పూర్తి కాగానే.. ఎక్కువ ఆల‌స్యం లేకుండా ‘లూసిఫ‌ర్‌’ రీమేక్‌ను సెట్స్ పైకి తీసుకెళ‌తారు.