May 15 2021 @ 07:59AM

హ‌న్సిక‌కి షాకిచ్చిన డైరెక్టర్

చ‌బ్బీ బ్యూటీ హ‌న్సిక మొత్వాని కెరీర్‌లో ప్రెస్టీజియ‌స్‌గా భావించి చేసిన సినిమా ‘మ‌హా‘. ఈ సినిమాపై హైకోర్టులో కేసు వేశారు. అది కూడా ఎవరో కాదు.. ఆ సినిమాను డైరెక్ట్ చేసిన డైరెక్టరే కావడం గమనార్హం. వివరాల్లోకెళ్తే.. హన్సిక నటించిన యాబైవ సినిమా ‘మహా’ . ఈ సినిమా. ఈ సినిమా కోసం మాజీ ప్రేమికుడు శింబుతో క‌లిసి న‌టించింది కూడా. గ‌త ఏడాదిలోనే సినిమాను విడుద‌ల చేయాల‌నుకున్న‌ప్ప‌టికీ క‌రోనా కార‌ణంగా వాయిదా వేస్తూ వ‌చ్చారు. ఎట్ట‌కేల‌కు ఈ సినిమాను ఓటీటీలో విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే సినిమా ద‌ర్శ‌కుడు జ‌మీల్ సినిమా విడుద‌ల‌పై అభ్యంత‌రాన్ని వ్య‌క్తం చేస్తూ మ‌ద్రాస్ హైకోర్టులో కేసు వేశారు. సినిమాలో కొంత భాగాన్ని త‌న‌కు తెలియ‌కుండా, స‌హాయ ద‌ర్శ‌కుడి సాయంతో కంప్లీట్ చేశార‌ని, క‌థ‌కు అవ‌స‌ర‌మైన స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించ‌లేద‌ని ద‌ర్శ‌కుడు తెలిపారు. అలాగే రెమ్యున‌రేష‌న్ చెల్లించ‌లేద‌ని, ఎడిటింగ్ కూడా త‌న ప్ర‌మేయం లేకుండా జ‌రిగింద‌ని జ‌మీల్ త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు. ఇప్ప‌టికే విడుద‌ల‌కు ఇబ్బంది ప‌డుతున్న హ‌న్సిక సినిమాకు ఇప్పుడు మ‌రో స‌మ‌స్య ఎదురు కావ‌డంతో అభిమానులు నిరాశ ప‌డ్డారు.