Abn logo
May 23 2020 @ 19:16PM

కరోనా పరిస్థితులపై కామెడీ సినిమా: బాలీవుడ్ డైరెక్టర్

ముంబై: బాలీవుడ్‌లో మంచి యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా 2013లో తెరకెక్కిన చిత్రం ఫక్రే. ఈ చిత్రానికి మ్రుగదీప్ సింగ్ లాంబా దర్శకత్వం వహించారు. 2017లో ఫక్రే రిటర్న్స్ సీక్వెల్ కూడా తీశారు. ఇప్పడు ఫక్రే 3 పేరుతో రెండో సీక్వెల్‌ను తీయనున్నారు. ఈ సినిమాలో కరోనా పరిస్థితులను కూడా చూపించనున్నట్లు దర్శకుడు మ్రుగదీప్ తెలిపారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, ‘ప్రధాన కథాంశంలో కరోనా ప్రస్తావన లేదు. కానీ ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా దానిని కూడా చూపేందుకు సిద్ధమవుతున్నాం. అయితే కావాలని జొప్పించినట్లు కాకుండా కథలో భాగంగానే కరోనా ప్రస్తావన ఉంటుంది’ అని మ్రుగదీప్ వివరించారు. ఈ చిత్రం మంచి కథాంశంతో తెరకెక్కుతోందని, వినోదాత్మక ధోరణిలో మంచి సందేశాత్మక చిత్రంగా దీనిని రూపొందింస్తున్నామని మ్రుగదీప్ తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement