Abn logo
Aug 21 2020 @ 23:19PM

‘ఎక్స్‌పెర్ట్’ అయిపోవాలంటే.. ‘పూరీ మ్యూజింగ్స్’ ఆడియో

Kaakateeya

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ‘పూరీ మ్యూజింగ్స్’ అంటూ తన వాయిస్ ఓవర్‌తో కొన్ని ఆడియోలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఏదో ఒక టాపిక్ తీసుకుని దానిపై తనకున్న అభిప్రాయం ఏమిటో చాలా విపులంగా పూరి తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో టాపిక్‌ల మీద వాయిస్ మ్యూజింగ్స్ విడుదల చేసిన పూరి.. తాజాగా ‘ఎక్స్‌పెర్ట్’ అనే టాపిక్ మీద వివరణ ఇచ్చారు. ఎవరైనా ‘ఎక్స్‌పెర్ట్’ అనిపించుకోవాలంటే ఏం చేయాలో పూరి చాలా క్లియర్‌గా ఈ ఆడియోలో తెలిపారు.


‘‘నువ్వు ఏ ఫీల్డ్‌లో ఉంటే.. ఏ పని చేస్తుంటే.. ఆ పనిలో నువ్వు ఎక్స్‌పెర్ట్ అయిపోవాలి. ఫస్ట్ నువ్వు చేస్తున్న పని నీకు ఇష్టమా? కాదా? చెక్ చేసుకో. ఇష్టమైతే మాత్రం ఇరగదీసేయ్. ఆ సబ్జెక్ట్‌ని పూర్తిగా చదివెయ్. ఆ ఫీల్డ్‌లో సీనియర్స్ అందరితో ఫ్రెండ్షిప్ చెయ్. వాళ్లతో మాట్లాడు. ఒక వేళ వాళ్లతో మాట్లాడటం కుదరకపోతే.. దూరం నుంచి చూడు. వాళ్ల దగ్గర పని చేయనవసరం లేదు. వాళ్ల వర్కింగ్ స్టైల్ అబ్జర్వ్ చేస్తే చాలు. ఇంటర్నెట్ వాడు. గూగుల్ వంటి వాటిని అడుగు. ఆ సబ్జెక్ట్ గురించి డీప్‌గా తెలుసుకో. కాస్త టైమ్ తీసుకుని నీవంతటికి నీవే ప్రిపేర్ అవ్వు. కమ్యూనికేటివ్ స్కిల్స్ పెంచుకో. షూ పాలిషింగ్ నీ జాబ్ అయితే.. అసలు షూ ఎప్పుడు పుట్టాయి. వాటికి పాలిష్ ఎవడు కనిపెట్టాడు. మొట్టమొదట ఇండియాకు షూ వేసుకొచ్చినోడి పేరేమిటి? షూ డర్టీగా ఉంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటి? షూ షైన్ అయితే ఉపయోగాలేమిటి? ఎదుటివాడి మీద ఎలాంటి ఇంప్రెషన్ కలుగుతుంది. ఇలాంటి విషయాల మీద నువ్వు ఆర్టికల్ రాయగలిగే స్టేజ్‌లో ఉండాలి. నీ ఫీల్డ్ గురించి కనీసం 10 నిమిషాలు మాట్లాడగలగాలి. బూట్ పాలిషింగ్ మీద నువ్వు రేడియో ఇంటర్వ్యూ ఇస్తే.. అందరూ ఆశ్చర్యపోవాలి.. ఏంటి ఇంత ఉందా ఇందులో అని. ఒకవేళ దొంగతనాలే నీ జీవితం అయితే.. పెద్ద పెద్ద దొంగల జీవితాల గురించి చదువు. వారి మైండ్ సెట్ ఎలా ఉంటుంది. వాళ్ల ఎడ్యుకేషన్ ఏమిటి? ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చారు? దొంగగా ఎందుకు మారారు? చేస్తే ఏ రేంజ్‌లో చేశారు? ఎలా దొరికిపోయారు? ఇలా అన్ని విషయాలు పరిశీలించి, నువ్వొక దొంగతనం ప్లాన్ చెయ్. అది నెక్ట్స్ లెవర్ రొబరీ అయి ఉండాలి. అది ఎంత గొప్పగా ఉండాలంటే.. నీ దొంగతనం బీబీసీ హెడ్‌లైన్స్ అయిపోవాలి..’’ అని పూరి ఈ ఆడియోలో పేర్కొన్నారు.  


Advertisement
Advertisement