Abn logo
Jul 23 2020 @ 22:58PM

‘పరువు’పై పూరి క్లాస్ మాములుగా ఇవ్వలేదు

Kaakateeya

పూరి ఏం చేసినా చాలా కొత్తగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే పూరి జగన్నాధ్ ట్రెండ్ సెట్టర్ అని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలోని కొన్ని సినిమాలను పక్కన పెడితే.. పూరి సినిమాలలో ఏదో ఒకటి ఇప్పటికీ ట్రెండ్ అవుతూ.. ఏదో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది. అది డైలాగ్ కావచ్చు, ఫైట్ కావచ్చు, పాట కావచ్చు.. ఏదైనా సరే.. ఇది పూరి సినిమా అనిపించేలా ట్రెండ్ క్రియేట్ చేశాడు పూరి. తాజాగా ఆయన మరో కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టారు. అదే పోడ్ కాస్ట్ మీడియా. దీని ద్వారా తన వాయిస్‌తో ఉన్న ఆడియోలని సోషల్ మీడియాలో ‘లక్డీకాపూల్’ అంటూ పూరి వినిపిస్తున్నాడు. ఏదో ఒక టాపిక్ తీసుకుని, దానిని పూరి వెర్షన్ పంచ్ డైలాగ్స్‌తో.. అరే ఇది నిజమేగా అనేలా పూరి దంచేస్తున్నాడు. తాజాగా ఆయన ఎత్తుకున్న టాపిక్ ‘పరువు’. 


ఇంట్లో వాళ్లు ఎప్పుడూ.. నలుగురు ఏం అనుకుంటారో..? ఈ సొసైటీలో మన పరువు ఎక్కడ పోతుందో అని ఏడుస్తూ ఉంటారు. నాకు తెలియక అడుగుతాను అసలు సొసైటీ అంటే ఎవరు? గాంధీజీ, రవీంద్రనాథ్ ఠాగూర్, అంబేద్కర్ వంటి వారితో ఈ సొసైటీ ఏమైనా నిండిఉందా? లేదు కదా..! మన చుట్టూ 100 మంది ఉంటే అందులో మంచి వాళ్లు అనుకోవడానికి ఓ 5గురు ఉంటారేమో.. మిగతా 95 మంది వేస్ట్ అండ్ యూజ్‌లెస్. మనకంటే వెధవలు సొసైటీ నిండా అంత మంది ఉన్నప్పుడు వాళ్ల కోసం బాధపడతారా? సో.. నీ ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమ్ అయినా ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. మంచోళ్లు ఎప్పుడూ అర్థం చేసుకుంటారు. మిగతా వెధవలు అర్థం చేసుకున్నా ఒకటే, చేసుకోకపోయినా ఒకటే. మన ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్ గురించి ఆలోచించాలి గానీ.. ‘పరువు’ గురించి కాదు.. ’’ అని పూరి ‘పరువు’పై క్లారిటీ ఇచ్చాడు.  

Advertisement
Advertisement