Abn logo
Sep 19 2020 @ 22:56PM

ఏ రాత్రి అయితే అందంగా ముగుస్తుందో.. అదే: పూరి

Kaakateeya

పగటి కంటే రాత్రి పూట ఎక్కువగా మేల్కొనే వారే ఎక్కువ షార్ప్‌గా ఉంటారని సర్వే తెలిపినట్లుగా చెప్పారు డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌. పూరీ మ్యూజింగ్స్‌లో ఆయన 'నైట్‌' (రాత్రి) అనే టాపిక్‌ మీద ముచ్చటించారు. ఏ రాత్రి అయితే అందంగా ముగుస్తుందో.. అదే గ్రేట్‌ డే అని అన్నారు. ఇంకా రాత్రి పూట చేసే ఎన్నో పనుల గురించి ఆయన తెలిపారు. అవేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.


''శ్రీశ్రీగారు చెప్పారు. వేళగానీ వేళలలో, లేనిపోని వాంఛలతో.. దారి కాని దారులలో, కానరాని కాంక్షలతో.. దేని కొరకు పదే పదే దేవులాడతావ్‌.. ఆలసించి, అలమటించి పాకులాడుతావ్‌.. శ్రీనివాసరావ్‌ అని. చిన్నప్పుడు ఇది చదవగానే.. దీనిని నాకోసమే ఆయన రాశారని అనుకున్నాను. లేనిపోని వాంఛలు.. ప్రతి రాత్రీ నిద్రపోవడానికి యుద్ధం చేయాల్సి వచ్చేది. ఆలోచనలు ఆగేవి కాదు. ఏం చేస్తామో తెలియదు.. కానీ మనందరికీ నిద్రలు పట్టవు. కానీ ఇంటిలిజెంట్‌ పీపుల్‌ అందరూ ఇలాగే ఎక్కువ సేపు రాత్రి పూట మేల్కొని ఉంటారని సర్వేలో తేలింది. హమ్మయ్యా.. అయితే మనం కూడా ఇంటిలిజెంటే అని చిన్న శాటిస్‌ఫ్యాక్షన్‌. పగలు కంటే రాత్రి చాలా విలువైనది. మన చుట్టూ ఉన్న మైండ్స్ అన్నీ డీప్ స్లీప్‌లో ఉంటాయ్‌. మనం మేల్కొని ఉంటాం. మనం మనతో కూర్చునే అవకాశం అప్పుడే దొరుకుతుంది. నిజమైన కల ఎప్పుడూ నిన్ను నిద్రపోనివ్వదు. ఏ కల లేనివాడే 8 గంటలకు పడుకుంటాడు. మరి మనమెందుకు పడుకుంటాం. బెల్జీయం యూనివర్శిటీ వాళ్లు 15 గుడ్లగూబల్ని..15 ఎర్లీ బర్డ్స్‌ని తీసుకుని టెస్ట్ చేస్తే.. రాత్రిపూట మేల్కొనే గుడ్లగూబలకి ఎక్కువ ఐక్యూ ఉందని తెలిసింది. అలాగే మెర్డెడ్‌ యూనివర్శిటీ వాళ్లు 1000 మంది యువకులని టెస్ట్ చేస్తే.. రాత్రి పూట ఎక్కువగా మేల్కొని ఉండే వెధవలే.. ఎక్కువ షార్ఫ్‌గా ఉన్నారని తెలిసింది. లిస్టులు బయటికి తీస్తే.. లేట్‌గా పడుకుని, లేట్‌గా లేచే వారి బ్యాంక్‌ అకౌంట్స్‌లోనే డబ్బు ఎక్కువగా ఉందట. 

పల్లెటూళ్లన్నీ త్వరగా పడుకుంటాయేమో గానీ, పట్టణాలన్నీ.. రాత్రిపూటే నిద్రలేస్తాయి.  ఎన్నో కోట్ల మంది ప్రతిరోజూ.. రాత్రి ఎప్పుడవుతుందా? అని ఎదురుచూస్తుంటారు. ప్రపంచంలో ఎన్నో నగరాలు ఒళ్లు విరుచుకుని నిద్రలేస్తాయ్‌. డ్యాన్స్ బార్లు, కెశినోలు, వీధి నాటకాలు, నైట్‌ బజార్లు.. పగటి పూట చూసిన అదే ప్రపంచం రాత్రి వేరేలా ఉంటుంది. లేట్‌ నైట్‌ పీపుల్‌కే క్రియేటివ్‌ సొల్యూషన్స్ దొరుకుతాయ్‌. కొన్ని ప్రొఫెషన్స్‌కి రాత్రే కరెక్ట్. బార్‌ ఓపెన్ చేసిన తర్వాత ఒక పొయిట్‌ రాయడం మొదలెడతాడు. ఒక మ్యూజిషియన్ ట్యూన్ చేయడం మొదలెడతాడు. రాత్రిపూటే నక్షత్రాలు చూడగలం. రాత్రి ఎంత చిక్కగా ఉంటే.. అన్ని నక్షత్రాలు కనబడతాయ్. ఒక థింకర్‌, పండువెన్నెల చూస్తూ.. సముద్రపు ఒడ్డున కూర్చుని ఉంటాడు. ఎన్నో ఆలోచనలు ఒకేసారి అతనిని చుట్టేస్తుంటాయ్‌. ఇలా నిశీధిలో ఎన్నో జరుగుతుంటాయి. విరహవేదన పడుతూ.. తలగడతో కలిసి అటు, ఇటు దొర్లే వాళ్లు.., కూని రాగం తీస్తూ.. మెల్లగా మత్తులోకి జారేవాళ్లు, సారేగమ కార్వాన్ పెట్టుకుని పాత పాటలు వినేవాళ్లు, ఎన్నో గంటలు గడిచాయో తెలియని ప్రేమికుల సంభాషణలు.. ఒకటి కాదు, మంచి స్నేహితులతో లేట్‌ నైట్‌ సంభాషణలు ఎప్పుడూ బాగుంటాయ్‌. ఓ చిన్న డోలక్ దగ్గర పెట్టుకుని, అందరూ తలొక పాట పాడుతూ.. అంత్యాక్షరిలు బాగుంటాయ్‌. లేట్‌ నైట్‌ డ్రైవ్స్ బాగుంటాయ్‌. ఎందుకో తెలియదు రాత్రి పూట ఒకరికి ఒకరు ఇంకా బాగా అర్థం అవుతారు. 

కోళ్లు కూస్తున్న వేళ, విటులు విశ్రమిస్తుంటారు. అలసిపోయిన పోలీసులు కళ్లు నులుముకుంటూ కనబడతారు. తెల్లవారు జామనున దోశ బండి దగ్గర ఆగడాలు, వేడివేడి ఇడ్లీ తినడాలు, మెల్లగా ఇంటికి చేరడాలు.. ఇలా రాత్రి ఒక అద్భుతం. ఆరోజు గ్రేట్‌ డే ఎప్పుడు అవుతుందో తెలుసా? ఏ రాత్రి అయితే అందంగా ముగుస్తుందో.. అదే గ్రేట్‌ డే. జీవితంలో మరిచిపోలేని రాత్రులు కొన్నే ఉంటాయి. అందుకే వీకెండ్స్‌ని అందమైన రాత్రులుగా మార్చి మన ఖాతాలో వేసుకోవాలి. వీకెండ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్‌.." అని పూరి తన మ్యూజింగ్స్‌లో రాత్రి ఎంత గొప్పదో తెలిపారు.


ఇవి కూడా చదవండిImage Caption

అతి వద్దు.. కొంచం నీరు, కొంచం నిప్పు అంతే.. : పూరిమీరు ఏ స్థితిలో ఉన్నా మీ కుక్క మీతోనే ఉంటుంది: పూరీ జగన్నాథ్భార్య బండబూతులు తిట్టినా.. నవ్వడమే.. : పూరివీలైతే అలా ప్రయత్నించండి: పూరీ జగన్నాథ్నాకు తెలిసి నిజమైన సాధువులు వారే: పూరిగ్రేటెస్ట్‌ మిషన్‌.. మన శరీరం విలువ తెలుసుకో: పూరీ జగన్నాథ్‌భయాన్ని జయించడానికి పూరీ చెప్పిన సూత్రాలివేమీ పూర్వీకులు గురించి తెలుసుకోవాలా!.. మీకొక గుడ్‌న్యూస్‌: పూరీ జగన్నాథ్‌రోజూ ఒక్క పూటే తింటే? : పూరి జగన్‌శ్మ‌శానాల్లో ప‌డుకోవాల‌ని ప్ర‌య‌త్నించా: పూరీ జ‌గ‌న్నాథ్ ఆకలితోనే ఉండండి : పూరీ జగన్నాథ్‌ఎంత డబ్బుంటే అంత పెద్ద దేవుడవుతాడు: పూరిపెళ్లి వద్దురా నాయనా..: పూరీ జగన్నాథ్‘పరువు’పై పూరి క్లాస్ మాములుగా ఇవ్వలేదుపూరీ దృష్టిలో సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎవరో తెలుసా?పూరీ మ్యూజింగ్స్‌లో టాపిక్.. ‘ఓల్డేజ్’ ‘ఎక్స్‌పెర్ట్’ అయిపోవాలంటే.. ‘పూరీ మ్యూజింగ్స్’ ఆడియోబ్రేకప్‌ మంచిదే: పూరీ జగన్నాథ్‌ఎవర్‌ పవర్‌ఫుల్‌. దోమా.. కరోనానా?: పూరి

Advertisement
Advertisement