Abn logo
Sep 20 2020 @ 19:00PM

ప్లాస్టిక్‌ కాదు.. ముందు నిన్ను బ్యాన్ చేయాలి: పూరి

Kaakateeya

ఒకప్పుడు ప్లాస్టిక్‌ని ప్రేమించిన వారంతా ఈరోజు.. బ్యాన్ చేయాలని అనడం, తిట్టడం వంటివి చేస్తున్నారు. అసలు ప్లాస్టిక్ ఏం చేసింది? ప్రాబ్లమ్‌ ప్లాస్టిక్‌లో కాదు. దానిని వాడటం చేతకాని మనలోనే ప్రాబ్లమ్‌ అని అన్నారు డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌. పూరీ మ్యూజింగ్స్‌లో ఆయన 'ప్లాస్టిక్' అనే టాపిక్ మీద మాట్లాడారు. ప్లాస్టిక్‌ను బ్యాన్ చేయడం కాదు.. రీ యూజ్ చేయడం నేర్చుకుంటే.. ఇది పెద్ద సమస్యే కాదు అన్నారు.. ఆ వివరాలేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

"ఈవాళ వరల్డ్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్‌ ఈజ్‌ క్లైమెట్‌ ఛేంజ్‌. ఈ మధ్య అందరూ ప్లాస్టిక్‌ మీద పడ్డారు. బ్యాన్ ప్లాస్టిక్‌.. బ్యాన్‌ ప్లాస్టిక్‌ అని. కానీ 1960లో ప్లాస్టిక్‌ కనుగొన్నప్పుడు మానవజాతి మొత్తం పొంగిపోయింది. కనిపెట్టినోడికి శాలువా కప్పి.. అన్నీ అవార్డులు వాడి చేతిలో పెట్టారు. ఎందుకంటే ప్లాస్టిక్ వలన నేచర్‌ని కాపాడుకోవచ్చు. ఇంక మనం చెట్లు కొట్టక్కరలేదు అని. మరి ఇప్పుడెందుకు ప్లాస్టిక్‌ను తిట్టుకుంటున్నాం. ఎక్కడబడితే అక్కడ ప్లాస్టిక్‌ కవర్లు పడి ఉన్నాయ్‌. అలా పారేసింది ఎవరు? మనం. మనకి ప్లాస్టిక్‌ వాడటం రాదు. ఇప్పుడు ప్లాస్టిక్‌ బ్యాన్‌ చేసి పేపర్‌కి వెళ్లిపోతామా? రోజూ ఎన్ని చెట్లు కొట్టాలి? ఎక్కడి నుంచి వస్తాయ్‌? 90 శాతం వెధవలు ఒక్క మొక్క కూడా లైఫ్‌లో నాటరు. బట్‌ సడెన్‌లీ ధే వాంట్స్ పేపర్ బ్యాగ్స్. 

ఈ ప్లానెట్‌కి కావాల్సిన ఎనఫ్ ప్లాస్టిక్‌కి అల్రెడీ మనం తీసేశాం. దానిని రీ యూజ్‌ చేస్తే.. చచ్చేంత వరకు వాడుకోవచ్చు. ఒక్క ప్లాస్టిక్ వల్లనే క్లైమెట్‌ ఛేంజ్‌ రాలేదు. 780 కోట్ల మంది జనం, యానిమల్స్, క్యాటిల్ అవి రిలీజ్ చేసే గ్యాస్‌, మిథేన్‌, కార్బన్‌ డయాక్సైడ్‌.. ఇవి కాకుండా ఫ్యాక్టరీలు ఇలా ఎన్నో కలిసి క్లైమెట్‌కి దెబ్బపడిపోయింది. ప్లాస్టిక్‌ను తిట్టుకోవద్దు. లెట్స్ రీ యూజ్ ప్లాస్టిక్‌. నువ్వు కూరగాయలు తెచ్చుకున్న ప్లాస్టిక్ బ్యాగ్‌ని మళ్లీ మళ్లీ వాడు. అంతేగానీ ప్లాస్టిక్‌ బ్యాన్ బ్యాన్‌ అని అనవద్దు. బ్యాన్ వరకు వెళితే.. ముందు నిన్ను బ్యాన్ చేయాలి. 5 బిలియన్ సంవత్సరాల నుంచి ఎప్పుడూ రాని క్లైమెట్‌ ఛేంజ్‌ ఇప్పుడే ఎందుకు వచ్చింది? నీ వల్ల. లెట్స్ రీ యూజ్ ప్లాస్టిక్. ప్లాస్టిక్ కవర్లు దాచుకోండి. పడేయవద్దు.. ప్లీజ్‌.." అని పూరి 'ప్లాస్టిక్'పై తన అభిప్రాయాన్ని తెలిపారు.


ఇవి కూడా చదవండిImage Caption

ఏ రాత్రి అయితే అందంగా ముగుస్తుందో.. అదే: పూరిఅతి వద్దు.. కొంచం నీరు, కొంచం నిప్పు అంతే.. : పూరిమీరు ఏ స్థితిలో ఉన్నా మీ కుక్క మీతోనే ఉంటుంది: పూరీ జగన్నాథ్భార్య బండబూతులు తిట్టినా.. నవ్వడమే.. : పూరివీలైతే అలా ప్రయత్నించండి: పూరీ జగన్నాథ్నాకు తెలిసి నిజమైన సాధువులు వారే: పూరిగ్రేటెస్ట్‌ మిషన్‌.. మన శరీరం విలువ తెలుసుకో: పూరీ జగన్నాథ్‌భయాన్ని జయించడానికి పూరీ చెప్పిన సూత్రాలివేమీ పూర్వీకులు గురించి తెలుసుకోవాలా!.. మీకొక గుడ్‌న్యూస్‌: పూరీ జగన్నాథ్‌రోజూ ఒక్క పూటే తింటే? : పూరి జగన్‌శ్మ‌శానాల్లో ప‌డుకోవాల‌ని ప్ర‌య‌త్నించా: పూరీ జ‌గ‌న్నాథ్ ఆకలితోనే ఉండండి : పూరీ జగన్నాథ్‌ఎంత డబ్బుంటే అంత పెద్ద దేవుడవుతాడు: పూరిపెళ్లి వద్దురా నాయనా..: పూరీ జగన్నాథ్‘పరువు’పై పూరి క్లాస్ మాములుగా ఇవ్వలేదుపూరీ దృష్టిలో సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎవరో తెలుసా?పూరీ మ్యూజింగ్స్‌లో టాపిక్.. ‘ఓల్డేజ్’ ‘ఎక్స్‌పెర్ట్’ అయిపోవాలంటే.. ‘పూరీ మ్యూజింగ్స్’ ఆడియోబ్రేకప్‌ మంచిదే: పూరీ జగన్నాథ్‌ఎవర్‌ పవర్‌ఫుల్‌. దోమా.. కరోనానా?: పూరి

Advertisement
Advertisement
Advertisement