Jun 25 2021 @ 12:23PM

వచ్చే వారంలో శంకర్‌ కుమార్తె వివాహం

కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌కు పాన్‌ ఇండియా దర్శకుడిగా గుర్తింపు ఉంది.  శంకర్‌కు ఇద్దరు కుమార్తెలు అదితి,  ఐశ్వర్య, ఒక కుమారుడు  అర్జిత్‌ ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తె అదితికి గత యేడాది నిశ్చితార్థం జరిగింది. ప్రముఖ బిజినెస్‌మేన్‌ కుమారుడితో అదితి వివాహం వచ్చే వారం పొల్లాచ్చిలో జరుగనున్నట్టు సమాచారం. ప్రస్తుతం చెన్నైతో పాటు నాలుగు జిల్లాలు మినహా ఇతర జిలాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. దీంతో ఈ వివాహం ఇరు కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో జరుగనుంది. లాక్‌డౌన్‌ ఆంక్షలు పూర్తిగా తొలగించిన తర్వాత చెన్నైలో రిసెప్షన్‌ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో దర్శకుడు శంకర్‌ ఉన్నారు.