ఆయన సినిమాని థియేటర్స్‌లో కంటే... అక్కడే ఎక్కువ మంది చూశారట!

బాలీవుడ్‌లో మంచి కంటెంట్ ఉన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ సుజీత్ సర్కార్. అద్భుతమైన కథలతో చిత్రాలు రూపొందించే ఆయన ఈ మధ్య ‘సర్ధార్ ఉదమ్’ సినిమాతో అందర్నీ ఆకట్టుకున్నాడు. విమర్శకుల్ని కూడా మెప్పించి పాజిటివ్ రివ్యూస్ సంపాదించాడు. అయితే, సుజీత్ మరో చిత్రం ‘అక్టోబర్’ గతంలో ఆ పని చేయలేకపోయింది. వరుణ్ ధావన్ హీరోగా విడుదలైన ఆ సినిమా కొన్నాళ్ల క్రితం థియేటర్స్‌కు వచ్చింది... 


పెద్ద తెరపై ‘అక్టోబర్’ సినిమా విడుదలైనప్పుడు చాలా మంది నెగటివ్ రివ్యూస్ ఇచ్చారు. స్క్రీన్ ప్లే స్లోగా ఉందంటూ, బోరింగ్ అంటూ కామెంట్స్ చేశారు. ఆ ఎఫెక్ట్‌తో సినిమా కమర్షియల్‌గా వర్కవుట్ కాలేదు. అయితే, థియేటర్స్ తరువాత ఓటీటీకి చేరిన ‘అక్టోబర్’ డిజిటిల్ బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి సక్సెస్ సాధించింది. వ్యూస్ పరంగా సుజీత్ సర్కార్ చిత్రానికి అనూహ్య స్పందన ఎదురైంది!


ఓటీటీలో ‘అక్టోబర్’ సినిమా చూసిన చాలా మంది దర్శకుడికి మెసేజ్ చేశారట. తాము ఆయన సినిమా థియేటర్స్‌లో ఉండగా నెగటివ్ రివ్యూస్ ప్రభావం వల్ల వెళ్లలేదని చెప్పారట. ఆన్‌లైన్‌లో చూశాక తమకు సినిమా నచ్చిందని అనేక మంది అన్నారట. ఈ విషయమంతా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సుజీత్ సర్కార్... ఓటీటీ వంటి వేదికలు రావటం విభిన్నమైన దర్శకులకి, కథకులకి శుభ పరిణామం అంటున్నాడు. తమ స్వంత ఆలోచనలతో కమర్షియల్ హడావిడికి దూరంగా సినిమాలు తీసేవారికి అవి కొత్త ఉత్సాహాన్ని అందిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించాడు. 

Advertisement

Bollywoodమరిన్ని...