Abn logo
Mar 26 2020 @ 01:02AM

సినీ కార్మికులకు వినాయక్‌ చేయూత

కరోనా వైరస్‌ కారణంగా షూటింగ్స్‌ నిలిచిపోవడంతో దినసరి వేతనంతో బతికే సినీ కార్మికులు, పేద కళాకారులు ఇబ్బంది పడుతున్నారు. వారిని ఆదుకోవడానికీ, తన వంతు సాయం అందించడానికి  దర్శకుడు వి.వి. వినాయక్‌ ముందుకు వచ్చారు. నటుడు కాదంబరి కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘మనం సైతం’ ఫౌండేషన్‌కు రూ. 5 లక్షలు అందజేశారు. నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న పేద కళాకారులు, కార్మికులు, డాన్సర్లు, ఫైటర్లు కాదంబరి కిరణ్‌కుమార్‌ను సంప్రదించి, సాయం పొందాల్సిందిగా బుధవారం విడుదల చేసిన ఓ వీడియోలో వినాయక్‌ పేర్కొన్నారు. నిరంతరం పేద సినీ కళాకారుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ‘మనం సైతం ’ ఫౌండేషన్‌ను ఈ సందర్భంగా వినాయక్‌ ప్రశంసించారు. 

Advertisement
Advertisement
Advertisement