హిందీలో ఛత్రపతి : వినాయక్‌

ABN , First Publish Date - 2021-01-16T06:31:37+05:30 IST

ప్రభాస్‌ హీరోగా తెలుగులో విజయవంతమైన ఛత్రపతి సినిమా హిందీలో రీమేక్‌ చేయనున్నట్టు దర్శకుడు వీవీ వినాయక్‌ తెలిపారు.

హిందీలో ఛత్రపతి  : వినాయక్‌
చాగల్లులో దర్శకుడు వీవీ వినాయక్‌ తదితరులు

చిరంజీవితో మరో సినిమా 

చాగల్లు, జనవరి 15: ప్రభాస్‌ హీరోగా తెలుగులో విజయవంతమైన ఛత్రపతి సినిమా హిందీలో  రీమేక్‌ చేయనున్నట్టు  దర్శకుడు వీవీ వినాయక్‌ తెలిపారు. సంక్రాంతి సందర్భంగా తన స్వగ్రామైన చాగల్లు విచ్చేసిన ఆయన అభిమానులు, బంధు మిత్రులతో కలిసి పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హిందీలో ఛత్రపతి అనంతరం చిరంజీవి హీరోగా మరో సినిమా చేయనున్నట్లు చెప్పారు. మాజీ సర్పంచ్‌ గండ్రోతు సురేంద్రకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

సంప్రదాయాలను పాటించాలి

కొవ్వూరు:  సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని  వినాయక్‌ అన్నారు. శుక్రవారం కొవ్వూరు మెరకవీధి గండ్రోతు పవన్‌ నివాసంలో వినాయక్‌ కేకు కట్‌ చేసి అందరికి సంక్రాంతి శుబాక్షాంక్షలు తెలిపారు. గండ్రోతు సురేంద్ర, జుట్టా ఏడుకొండలు, ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-01-16T06:31:37+05:30 IST