Abn logo
Mar 1 2021 @ 23:26PM

కామారెడ్డిలో బాలుడి అదృశ్యం

కామారెడ్డి, మార్చి1: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ధర్మాశాల వద్ద నుంచి 13ఏళ్ల వయస్సు గల బాలుడు అదృశ్యమయ్యారు. పోలీసులు, కుటుంబీకు లు తెలిపిన వివరాల ప్రకారం.. కలకత్తకు చెందిన ఆసిఫ్‌ మాల్లిక్‌ కామా రెడ్డి జిల్లా కేంద్రంలోని పాత సిండికేట్‌ బ్యాంక్‌ వద్ద ఉండే ఎస్‌కే మహల్‌ ఇంటి వద్ద ఏడాది క్రితం నుంచి ఉంటున్నాడు. గత మూడు రోజుల కిందట మిర్చిలు కొనుగోలు చేయడానికి బయటకు వెళ్లి తిరిగి ఇంటిరాలేదని తెలి పారు. ఎస్‌కే మహల్‌ మాల్లిక్‌ ఇంటి రాకపోవడంతో చుట్టు ప్రక్కల ప్రాంతా ల్లో వెతకగా ఎక్కడ ఆచూకి దోరకపోవడంతో సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బాలుని ఆచుకి తెలిసినట్టయితే 6297914828, 9440010938కి పోన్‌ చేయాలని తెలిపారు.


Advertisement
Advertisement