పచ్చదనంతో వైపరీత్యాలు తగ్గుముఖం

ABN , First Publish Date - 2021-06-23T03:48:18+05:30 IST

పచ్చదనంతో వైపరీత్యాలు తగ్గుముఖం

పచ్చదనంతో వైపరీత్యాలు తగ్గుముఖం
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌

షాద్‌నగర్‌ అర్బన్‌: హరితహారంలో భాగంగా పచ్చదనాన్ని పెం చితే ప్రకృతి వైపరీత్యాలు తగ్గి, పాడి పంటలతో ప్రకృతి సస్యశ్యామలం అవుతుందని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్‌ అన్నారు. ఫరూఖ్‌నగర్‌ మండల పరిషత్‌లో మంగళవారం నియోజకవర్గ స్థాయి హరితహారం కార్యక్రమంపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏడో విడత హరితహారాన్ని విజ యవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని కోరారు. పల్లె ప్ర కృతి వనం వలనే ప్రతీ మండల కేంద్రంలో ఐదు నుంచి పది ఎకరాల్లో ప్రకృతి వనాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. రోడ్ల పక్కనున్న చెట్లను విద్యుత్‌ వైర్ల కారణంగా నరికివేస్తున్నారని, వైర్ల కింద కానుగ, సీతాఫ లం వంటి మొక్కలు నాటాలని సూచించారు. హరితహారం కార్యక్రమంలో ఎక్కువగా పండ్ల మొక్కలకు నాటి, సంరక్షించాలని సూచించా రు. పండ్ల వృక్షాలను పెంచితేనే కోతులు గ్రామాల్లోకి రావని, పంటలు నాశనం చేయవని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కె. నరే ందర్‌, ఎంపీపీ ఖాజా ఇద్రిస్‌అహ్మద్‌, జడ్పీటీసీ పి.వెంకట్‌రాంరెడ్డి, ఏడీ ఏ రాజారత్నం, ఎంపీడీఓ డి.శరత్‌చంద్రబాబు, డీఎల్పీవో సురే్‌షకుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ లావణ్య పాల్గొన్నారు. 

హరితహారానికి సన్నద్ధమవ్వండి

ఇబ్రహీంపట్నం: హరితహారం కార్యకమ్రం విజయవంతానికి సమాయత్తం కావాలని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అధికారులకు సూచించా రు. ఇబ్రహీంపట్నంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో అటవీ, ము న్సిపల్‌ శాఖల అధికారులు, ఎంపీడీవోలతో సమావేశం నిర్వహించా రు. మండలాలు, మున్సిపాలిటీల వారీ సమావేశాలు పెట్టుకొని లక్ష్యా లు నిర్దేశించుకోవాలన్నారు. ఇప్పటి వరకు అధికారులు, ప్రజాప్రతినిధుల చొరవతో మొక్కల పెంపకం ఓ యజ్ఞంలా చేపట్టామని ప్రశంసించారు. రోడ్ల వెంట, కాలనీల్లో, స్మశాన వాటికలు, డంపింగ్‌ యార్డు లు, ప్రభుత్వ స్థలాలు, విద్యా సంస్థల్ల్లో మొక్కలు నాటేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. వర్షాలు రాగానే గుంతలు తీయించి మొక్కలు నాటాలన్నారు. రైతులు తమ పొలాల్లో ఉన్న భూమిలో పది శాతంలో మొక్కలు పెంచేలా పోత్సహించాలన్నారు. అటవీశాఖ రేంజర్‌ జె.విష్ణువర్ధన్‌రావు, మున్సిపల్‌ కమిషనర్లు జయంత్‌కుమార్‌రెడ్డి, షషియుల్లా, ఖమర్‌ అహ్మద్‌, ఎంపీడీవోలు మహే్‌షబాబు, దేవేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌, మమతాబాయి, నాయకుడు వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.

హరితహారాన్ని విజయవంతం చేయాలి

చేవెళ్ల: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య అన్నారు. చేవెళ్లలోని క్యాంప్‌ కార్యాలయంలో నాలుగు మం డలాల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 6లక్షల మొక్కలను నాటడం లక్ష్యం అన్నారు. ప్రతీ మండలానికి లక్షకుపైగా మొక్కలు నాటాలని అధికారులకు టార్గెట్‌ ఇచ్చామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టుదలతో 7 సంవత్సరాలుగా హరితహారాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజలు చైతన్యంతో మొక్కలు నాటేందుకు ముందుకు రావాలని ఎమ్మెల్యే పి లుపునిచ్చారు. సమావేశంలో శంకర్‌పల్లి జడ్పీటీసీ గోవిందమ్మ, ఎంపీ పీ గోవర్ధన్‌రెడ్డి, ఎంపీడీవోలు హరీశ్‌కుమార్‌, విజయలక్ష్మి, సత్తయ్య,  తహసీల్దార్లు అశోక్‌కుమార్‌, ఆమరలింగంగౌడ్‌, అనిత, కృష్ణకుమార్‌, పీఆర్డీఈ జగన్‌రెడ్డి, ఎంఈవో ఆక్బర్‌, ఏఈలు ప్రశాంత్‌రెడ్డి, అనూష, ఏవోలు రాగమ్మ, కృష్ణమోహన్‌, అటవీ, ఆర్‌అండ్‌బీ, ఎక్సైజ్‌, ఉపాధిహా మీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. 

అన్ని గ్రామాల్లో మొక్కలు నాటాలి

మహేశ్వరం: హరితహారంలో భాగంగా ప్రతీ గ్రామంలో మొక్క లు నాటి సంరక్షించాలని ఎంపీపీ కె.రఘుమారెడ్డి అన్నారు. మండల పరిషత్‌లో సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలో 1.50లక్షల మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నాయని, కార్యాలయాలు, పాఠశాలల ప్రాంగణాలు, రోడ్డుకిరువైపులా మొక్కలు నాటాలన్నారు. వైస్‌ఎంపీపీ ఆర్‌.సు నీత, ఎండీవో బి.నర్సింహులు, ఏపీవో చారి పాల్గొన్నారు.

 1.60లక్షల మొక్కలు లక్ష్యం

కందుకూరు: హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ మంద జ్యోతి, ఎండీవో జి.కృష్ణకుమారి అన్నారు. మండల పరిషత్‌లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో నిర్వహించిన సమావేశంలో వా రు మాట్లాడారు. ఈ ఏడాది 35 పంచాయితీల్లో లక్షా60వేల మొక్కలు నాటి, సంరక్షించే బాధ్యతను సర్పంచ్‌లు తీసుకోవాలన్నారు. వైస్‌ ఎంపీపీ గంగుల శమంతాప్రభాకర్‌రెడ్డి, ఎంపీవో విజయలక్ష్మి, ఏపీవో రవీ ందర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఏడో విడతలో 1.67లక్షల మొక్కల పెంపకం 

కడ్తాల్‌: హరితహారం విజయవంతానికి ప్రజలు సహకరించాలని ఎంపీడీవో రామకృష్ణ కోరారు. మైసిగండి, గోవిందాయిపల్లి తండా, క ర్కల్‌పహాడ్‌, నార్లకుంట తండాలలో పర్యటించారు. డంపింగ్‌ యార్డ్‌ లు, వైకుంటధామాలను పరిశీలించారు. హరితహారంలో రోడ్లకిరువైపు ల 10,850 మొక్కలు, ప్రభుత్వ స్థలాల్లో 3140, కమ్యూనిటీ ప్రా ంతాల్లో 14,450, రైతుల పొలాల్లో 15,450, ఇళ్ల వద్ద 50,876, పల్లె ప్ర కృతి వనాల్లో 19,542, చనిపోయిన వాటి స్థానంలో 10,800, ఇతర ప్రా ంతా ల్లో 35,615మొక్కలు, పండ్ల మొక్కలు 6277 నాటాలని నిర్ణయించిన ట్లు ఆయన వివరించారు. సర్పంచ్‌లు తులసీరామ్‌నాయక్‌, రామునా యక్‌, నాగమణివెంకోబా, కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-23T03:48:18+05:30 IST