ఎన్‌సీసీతో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు

ABN , First Publish Date - 2020-11-23T06:25:13+05:30 IST

ఎన్‌సీసీ శిక్షణతో విద్యార్థుల్లో చదువుతో పాటు సమాజాన్ని చదవి, క్రమశిక్షణ గల పౌరులుగా ఎదుగుదలకు ఎంతో కృషి చేస్తుందని కెప్టెన్‌ రేల్ల సంజీవ్‌ అన్నారు.

ఎన్‌సీసీతో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు
మాట్లాడుతున్న కెప్టెన్‌ సంజీవ్‌

- కెప్టెన్‌ రేల్ల సంజీవ్‌ 

పెద్దపల్లి రూరల్‌, నవంబరు 22: ఎన్‌సీసీ శిక్షణతో విద్యార్థుల్లో చదువుతో పాటు సమాజాన్ని చదవి, క్రమశిక్షణ గల పౌరులుగా ఎదుగుదలకు ఎంతో కృషి చేస్తుందని కెప్టెన్‌ రేల్ల సంజీవ్‌ అన్నారు. ఆదివారం పెద్దకల్వల డిగ్రీ కళాశాలలో ఎన్‌సీసీ యూనిట్‌ ఆఽధ్వర్యంలో 72వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంజీవ్‌ మాట్లాడుతూ శిక్షణ వల్ల విద్యార్థుల్లో జాతీయ సమైఖ్యత, నాయకత్వ లక్షణాలు, ప్రకృతి వైపరీత్యాలను గూర్చి అవగాహన, ఆరోగ్యం పరిశుభ్రత, ఫైరింగ్‌, డ్రీల్‌ శిక్షణలో ప్రావీణ్యత సాధించవచ్చన్నారు. ఈ అకడమిక్‌ సంవత్సరంలో కళాశాల నుంచి జాతీయ స్థాయి శిక్షణగా శిబిరాలకు హాజరైన కడారి సుమంత్‌ బేసిక్‌ మానిటరింగ్‌ ఉత్త రకాశీలి హాజరై ప్రత్యేక సమైక్యత కనబరిచినందుకు ప్రశంసించారు. జాతీయ సమైక్యత శిబిరానికి చెవుల అనిల్‌కుమార్‌ నేతృత్వంలో పాల్గొన్న 9 మంది కేడె ట్లు, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో హాజరై ప్రణయ్‌, శివకుమార్‌, వినయ్‌, శివసాయి, ఆర్మీ అటాచ్‌మెంట్‌ సికిందరాబాద్‌లో హాజరైన పవన్‌ కళ్యాణ్‌, నవీన్‌ కుమార్‌లను కళాశాల ప్రిన్సిపాల్‌ నితిన్‌, బెటాలియన్‌ సుబేదార్‌ పాల్‌ లు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ కేడెట్లు అనిల్‌ కుమార్‌, ప్రణయ్‌లు కళాశాలలో జరుగుతున్న ఎన్‌సీసీ కార్యక్రమాలే భవిష్య త్తులో ఆవశ్యకతను గూర్చి కేడెట్లకు తెలిపారు. 

Updated Date - 2020-11-23T06:25:13+05:30 IST