దిశా చట్టం మహిళలకు భద్రతగా ఉంది: మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ

ABN , First Publish Date - 2020-05-27T22:47:45+05:30 IST

లాక్‌డౌన్‌లో గృహహింస కేసులు పెరిగాయని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు.

దిశా చట్టం మహిళలకు భద్రతగా ఉంది: మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ

విజయవాడ: లాక్‌డౌన్‌లో గృహహింస కేసులు పెరిగాయని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఇందుకోసం  హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేశామని, 200 ఫిర్యాదులు వచ్చాయని వాసిరెడ్డి పద్మ తెలిపారు. గృహహింసకు సంబంధించి డీజీపీతో కూడా మాట్లాడామని ఆమె చెప్పారు. కరోనా వల్ల ఆర్థిక భద్రత భయపెట్టిందని, aమద్యం అమ్మకాలు 25శాతం తగ్గాయని, దశలవారీగా మద్యాన్ని నియంత్రించామని ఆమె అన్నారు. దిశా చట్టం మహిళలకు భద్రతగా ఉందని, దిశ చట్టం వచ్చాక 20 కేసుల్లో శిక్ష కూడా ఖరారు చేశామని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు.


Updated Date - 2020-05-27T22:47:45+05:30 IST