Apr 19 2021 @ 19:58PM

మాల్దీవుల్లో బోల్డ్‌ బ్యూటీ

సినీ తారలకు ఏ మాత్రం గ్యాప్‌ దొరికినా ఏదో ఒక దీవిలో వాలిపోయి సేద తీరుతుంటారు. ప్రస్తుతం మహారాష్ర్టలో కరోనా విజృంభిస్తున్నప్పటికీ  సరదాల విషయంలో బాలీవుడ్‌ తారలు ఏమాత్రం తగ్గడం లేదు. బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ దిశా పటానీ ప్రస్తుతం మాల్దీవుల్లో సేద తీరుతున్నారు. శరీరానికి ఆయిల్‌ పూసుకొని బికినీ ధరించి బీచ్‌లోని ఇసుకలో కూర్చుని తన అందాలను ఆరబోశారు. ఆ ఫొటోలను సోషల్‌ మీడియా షేర్‌ చేయగా ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. అయితే తనతోపాటు ఆమె ప్రియుడు టైగర్‌ ష్రాఫ్‌ కూడా మాల్దీవులకి వెళ్లారు. ఇలా చేయడం దిశాకు కొత్తేమీ కాదు. తనపై ఎవరెన్ని కామెంట్లు చేసినా ఆమె లెక్క చేయరు. ప్రస్తుతం దిశా పటానీ 'రాధే', 'ఏక్‌ విలన్‌ రిటర్న్‌' సినిమాలతో బిజీగా ఉన్నారు.