డిష్యుం.. డిష్యుం

ABN , First Publish Date - 2022-01-26T06:57:22+05:30 IST

బీజేపీ.. టీఆర్‌ఎస్‌.. డిష్యుం అంటే డిష్యుం అంటున్నా యి. ఇరు పార్టీల నేతలు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. పరస్పర భౌతిక దాడులకు తెగబడుతూ.. జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త సంప్రదాయానికి తెర తీస్తున్నారు. ఆర్మూర్‌ నియోజకవర్గంలో మంగళవారం ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

డిష్యుం.. డిష్యుం

ఎంపీ పర్యటన ఉద్రిక్తం 

ఇస్సపల్లిలో బీజేపీ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌

పలు వాహనాలు ధ్వంసం.. పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలు

దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే : ఎంపీ 

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నిజామాబాద్‌ / ఆర్మూర్‌ టౌన్‌): బీజేపీ.. టీఆర్‌ఎస్‌.. డిష్యుం అంటే డిష్యుం అంటున్నా యి. ఇరు పార్టీల నేతలు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. పరస్పర భౌతిక దాడులకు తెగబడుతూ.. జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త సంప్రదాయానికి తెర తీస్తున్నారు. ఆర్మూర్‌ నియోజకవర్గంలో మంగళవారం ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. బీజేపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య పరస్పర దాడులకు దారి తీసింది. ఎంపీ తమ నియోజకవర్గానికి వస్తున్నాడని తెలియడంతో.. ఇస్సపల్లి గ్రామం వద్దకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలొచ్చి ఎంపీని రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాటతో మొదలైన వివా దం.. ఆ తర్వాత క్రమంగా భౌతిక దాడుల కు దారితీసింది. ఈ ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలకు స్వల్ప గాయాలు కాగా.. కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై దాడులకు ప్రయత్నించింది ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలోని టీఆర్‌ఎస్‌ నేతలేనని ఎంపీ అర్వింద్‌ ఆరోపించారు. దాడులకు పాల్పడింది టీఆర్‌ఎస్‌ శ్రేణులు కాదని రైతులే నిలదీశారని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రకటించారు. జిల్లాలోని ఆర్మూర్‌ మండలం ఇస్సపల్లి వద్ద నందిపేటకు వెళ్తున్న ఎంపీని పోలీసులు మంగళవారం నిలిపివేశా రు. ముందు గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ శ్రేణులతో పాటు రైతులు ఎక్కువగా ఉన్నారని, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయ ని ప్రస్తుతం వెళ్లవద్దని ఆపారు. దీంతో తాను ఎంపీ ల్యాండ్స్‌ ద్వారా చేపట్టిన పనులను ప్రారంభించేందుకు వెళ్తున్నానని త్వరగా వారిని క్లియర్‌చేసి తనను వెళ్లనివ్వాలని ఎంపీ పోలీసులను కోరారు. ఆ క్రమంలోనే ఆలూరు, దేగాంతో పాటు ఇతర ప్రాంతాల్లో ధర్నాలు ఉన్న రైతులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీగా ఇస్సపల్లికి చేరుకున్నారు. ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు మొదలుపెట్టారు. బీజేపీ శ్రేణులు కూడా నినాదా లు చేయడంతో గొడవ ముదిరింది. ఇరు పార్టీల నేతలు తోసుకోవడంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈలోపే మరికొంతమంది ఇస్సపల్లికి చేరుకోవడంతో గొడవ ఎక్కువ కావడం.. బీజేపీ శ్రేణులపై టీఆర్‌ఎస్‌ శ్రేణులు రాళ్ల తో దాడులకు దిగడంతో ఎంపీ వాహనంతో సహా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. దాడులు కొనసాగుతుండడంతో పోలీసులు అక్కడ నుంచి ఎంపీతో పాటు నియోజకవర్గ ఇన్‌చార్జి వినయ్‌రెడ్డి, ఇతర నేతలను పంపించారు. వా రు వెళ్తున్న క్రమంలోనే దాడులు కొనసాగుతుండడంతో పలువురు బీజేపీ కార్యకర్తలకు దెబ్బలు తాకాయి. ఎక్కువ మంది ముందుకు రావడంతో పోలీసులు అడ్డుకునే ప్రయ త్నం చేయగా.. బీజేపీ నేతలకు చెందిన కార్లను ధ్వంసం చేశారు. బీజేపీకి చెందిన ఆరుగురు కార్యకర్తల వరకు దెబ్బ లు తాకగా పోలీసులు అక్కడ నుంచి అందరినీ చెదరగొట్టా రు. అక్కడ నుంచి ఎంపీతో సహా నేతలు సీపీ కార్యాలయానికి తరలొచ్చి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.   

ఫ ఎంపీ , ఎమ్మెల్యే ఢీ అంటే ఢీ 

ఎంపీ అర్వింద్‌, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఢీ అంటే ఢీ అంటున్నారు. ఆర్మూర్‌ నియోజకవర్గ పర్యటనకు వచ్చి నప్పుడే కాకుండా ఇతర సమయాల్లోనూ ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. రాష్ట్రస్థాయిలోనూ ఇద్దరూ మాటల మంటలు రేపుతున్నారు. గత కొన్ని నెలలుగా నెలకొన్న పరిస్థితులు ప్రస్తుతం ఉద్రిక్తతకు దారి తీశాయి. కరోనా కారణంగా ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆర్మూర్‌లో లేకున్నా.. ఆయన అనుచరులు మాత్రం ఎంపీ వెళ్లే దారుల గుండా ఎంపీని నిలదీసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇది కాస్త చివరకు భౌతిక దా డుల వరకు దారి తీసింది. మొత్తమ్మీద ఈ ఇద్దరి నాయకుల మధ్య పోరు.. మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే..!! 

జీవన్‌రెడ్డిని 50వేల మెజార్టీతో ఓడిస్తా.. 

‘జీవన్‌రెడ్డి.. కేసీఆర్‌తో మాట్లాడి వచ్చే ఎన్నికల్లో టికెట్‌ తెచ్చుకో.. ఆర్మూ ర్‌ గడ్డ మీదనే 50వేల ఓట్ల మెజార్టీతో నిన్ను ఓడిస్తా’.. అని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ సవాల్‌ చేశారు. మంగళవారం ఆయన నిజామాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. పోలీసు కమిషనర్‌, పలువురు పోలీసులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కలిసి తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆర్మూర్‌ ఎమ్మె ల్యే జీవన్‌రెడ్డి ఓ బచ్చా అని అన్నారు. ఆయన్ను వచ్చే ఎన్నికల్లో 50వేల ఓట్ల మెజార్టీతో ఓడిస్తానని సవాల్‌ విసిరారు.

 ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే దాడులు : ఎంపీ అర్వింద్‌

ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రోద్బలంతోనే ఆయన అనుచరులు నర్సయ్య, పూజ నరేందర్‌, కార్తీక్‌రెడ్డి, ఇతర నేతలు బీజేపీ శ్రేణులపై దాడులకు పాల్పడ్డారని ఎంపీ అర్వింద్‌ ఆరోపించారు. కార్యక్రమానికి వెళ్లేముందు దేగాం, ఆలూరులో టీఆర్‌ఎస్‌ కార్యకర్తల ధర్నా విషయాన్ని కూడా సీపీ దృష్టికి తీసుకెళ్లినా తగిన బందోబస్తును ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి దాడులు చేయించినంత మాత్రాన తాము బెదరబోమని స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన టీఆర్‌ఎస్‌ శ్రేణులను కఠినంగా శిక్షించాలని అర్వింద్‌ డిమాండ్‌ చేశారు. 

ఎంపీని అడ్డుకుంది పసుపు రైతులే : జీవన్‌రెడ్డి

ఎంపీ అర్వింద్‌ను అడ్డుకుంది టీఆర్‌ఎస్‌ శ్రేణులు కాదని.. పసుపు రైతులని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. పసుపుబోర్డు తేకుండా ఎంపీ అర్వింద్‌ ఏ గ్రామంలో కూడా అడుగుపెట్టలేడన్నారు. రైతుల దృష్టి మళ్లించేందుకే సీఎం కేసీఆర్‌, ప్రభుత్వంపై అక్కసు వెల్లగక్కుతున్నాడని మండిపడ్డారు. సీఎంతో పాటు ప్రభుత్వం జోలికివస్తే ఊరుకోబోమన్నారు. పసుపుబోర్డు తెస్తానని మూడేళ్ల క్రితం హామీ ఇచ్చి.. ఇప్ప టివరకు పట్టించుకోలేదని జీవన్‌రెడ్డి విమర్శించారు. టీఆర్‌ఎస్‌ను విమర్శించే ముందు రైతులకు ఎంపీ సమాధానం చెప్పాలని హితవు పలికారు. 

Updated Date - 2022-01-26T06:57:22+05:30 IST