Abn logo
Sep 18 2021 @ 22:55PM

ఆస్తి, చెత్తపన్ను జీవోలు రద్దుచేయాలి

గూడూరు, సెప్టెంబరు 18: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసి ఆస్తిపన్ను పెంపు, చెత్తపన్ను జీవోలను ఉపసంహరించుకోవాలని జనసేన నాయకులు శనివారం మున్సిపల్‌ కార్యాలయంలో ఆర్‌డీఎం శ్రీనివాస రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్‌ మాట్లాడుతూ కొవిడ్‌ కాలంలో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే పన్నుపెంపు పేరుతో ఆర్థికభారం మోపితే పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు. గూడూ రు మున్సిపాలిటీలో  శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ పోస్టును భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో మోహన్‌, ఇంద్రవర్ధన్‌, రాజశేఖర్‌, సంతోష్‌ పాల్గొన్నారు.