టీటీడీలో ఏవీఎస్వోలకు స్థానచలనం

ABN , First Publish Date - 2021-03-02T08:18:29+05:30 IST

టీటీడీలోని ఏవీఎస్వోలకు స్థానచలనం కల్పిస్తూ సీవీఎస్వో గోపీనాథ్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

టీటీడీలో ఏవీఎస్వోలకు స్థానచలనం

తిరుమల, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): టీటీడీలోని ఏవీఎస్వోలకు స్థానచలనం కల్పిస్తూ సీవీఎస్వో గోపీనాథ్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆలయ ఏవీఎస్వోగా ఉన్న గంగరాజును మూడో సెక్టార్‌కు బదిలీ చేశారు. ఈ స్థానంలో అలిపిరి ఏవీఎస్వో సురేంద్రను నియమించారు. నాల్గవ సెక్టార్‌ నుంచి వీరబాబును రెండో సెక్టార్‌కు పంపి, ఈ స్థానానికి మూడో సెక్టార్‌ ఏవీఎస్వో భువన్‌కుమార్‌ను నియమించారు. అలాగే ఐదో సెక్టార్‌ ఏవీఎస్వోగా శైలేంద్ర, ఆరో సెక్టార్‌కు వెంకటరమణ, ఏడో సెక్టార్‌కు గిరిధర్‌, తొమ్మిదో సెక్టార్‌ ఏవీఎస్వోగా నారాయణను నియమించారు. 


విజిలెన్స్‌ అదుపులో వేణుగోపాల స్వామి ఆలయ సిబ్బంది

పాపవినాశనం మార్గంలోని వేణుగోపాలస్వామి ఆలయ సిబ్బందిని ప్రభుత్వ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా.. విక్రయించిన టికెట్ల కంటే అదనంగా రూ.8,500 నగదు కలిగి ఉన్నారన్న కారణంతో ఇద్దరిని విజిలెన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

Updated Date - 2021-03-02T08:18:29+05:30 IST