తమ ఇంటి ముందుకు మురుగు నీరు వస్తోందని ఫిర్యాదు.. ఆ చిన్న గొడవ ఎంతటి ఘోరానికి దారి తీసిందంటే..

ABN , First Publish Date - 2022-01-27T19:58:25+05:30 IST

ఆ తండ్రీ, కొడుకు తమ ఇంటి ముందు రోడ్డు మీద గేదెలను కడుగుతున్నారు.. ఆ నీరు పక్కింటి ముందుకు చేరింది..

తమ ఇంటి ముందుకు మురుగు నీరు వస్తోందని ఫిర్యాదు.. ఆ చిన్న గొడవ ఎంతటి ఘోరానికి దారి తీసిందంటే..

ఆ తండ్రీ, కొడుకు తమ ఇంటి ముందు రోడ్డు మీద గేదెలను కడుగుతున్నారు.. ఆ నీరు పక్కింటి ముందుకు చేరింది.. దీంతో వారు నీటి గురించి ఫిర్యాదు చేశారు.. ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది.. ఆ గొడవ పెద్ద ఘర్షణగా మారింది.. ఈ క్రమంలో నీటి గురించి ఫిర్యాదు చేసిన వారిపై తండ్రీ, కొడుకు కత్తులతో దాడి చేశారు.. బాధితులు ప్రస్తుతం హాస్పిటల్‌లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.. హర్యానాలోని గుధాన్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. 


గుధాన్ గ్రామానికి చెందిన సింఘ్ రామ్, అతని కొడుకు మోహిత్ బుధవారం ఉదయం తమ ఇంటి ముందు గేదెలను కడుతున్నారు. ఆ నీరు పక్కన ఉండే దుష్యంత్ ఇంటి ముందు చేరింది. దీంతో దుష్యంత్, అతని అత్త సుమన్ ఆ నీటి గురించి సింఘ్ రామ్‌ను ప్రశ్నించారు. అలా వారి మధ్య గొడవ ప్రారంభమైంది. అది ముదరడంతో ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ క్రమంలో సింఘ్ రామ్ భార్య కవిత, కూతురు సోనియా కూడా గొడవకు దిగారు. 


వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో సోనియా తమ ఇంటి వంట గదిలోకి వెళ్లి రెండు కత్తులను తీసుకొచ్చి తండ్రికి, అన్నయ్యకు ఇచ్చింది. వారు ఆ కత్తులతో దుష్యంత్, అతని అత్త సుమన్, మామ నరేంద్రపై దాడికి పాల్పడ్డారు. మెడపై, చేతులపై కత్తులతో పొడిచారు. ఈ దాడిలో సుమన్, నరేంద్ర తీవ్రంగా గాయపడ్డారు. దాడి అనంతరం సింఘ్ రామ్ కుటుంబ సభ్యులు పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.  సింఘ్ రామ్ కుటుంబ సభ్యుల కోసం గాలిస్తున్నారు. 


Updated Date - 2022-01-27T19:58:25+05:30 IST